మహిళలకు ఫ్రీ బస్సు ప్రారంభ ముహూర్తం ఫిక్స్ - కండీషన్స్ అప్లై..!!
ఏపీలో మరో పథకం అమలుకు కసరత్తు జరుగుతోంది. టీడీపీ ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ పథకం అమలు..ఆర్దిక భారం వంటి అంశాల పైన అధికారులు నివేదిక సిద్దం చేసారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించే సమీక్షలో పథకం అమలు పైన కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అదే సమయంలో పథకం అమలు లో అధికారులు కొన్ని కండీషన్లు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఉచిత బస్సు అమలు
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఆర్టీసీ అధికారులు తెలంగాణ, కర్ణాటలో ఈ పథకం అమలు పైన అధ్యయనం చేసారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిత్యం 15 లక్షల మంది ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణం సాగిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తే ప్రతీ నెలా ఆర్టీసి పైన రూ 250 కోట్ల మేర భారం పడుతుందని అధికారులు లెక్కలు తేల్చారు. ఈ పథకం అమలు చేయాలంటే కొత్త బస్సులు అవసరమని ప్రభుత్వానికి అధికారులు నివేదించారు.

అధికారుల నివేదిక
ఆర్టీసీలో ఉన్న ఏ కేటగిరీ బస్సులను ఉచిత ప్రయాణం కోసం కేటాయించాలనే అంశం పైన కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. పల్లెవెలుగు, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్‌లతో పాటు విశాఖపట్నం, విజయవాడలోని సిటీ, మెట్రో బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీని అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు, హైదరాబాద్‌లోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.
చంద్రబాబు నిర్ణయం
కర్ణాటకలోని గ్రామీణ బస్సు సర్వీసులు, బెంగళూరులోని సిటీ సర్వీసుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. పథకంలో భాగంగా తెలంగాణ, కర్ణాటకలో జీరో టిక్కెట్ జారీ అవుతుంది. టిక్కెట్‌పై చార్జీ సున్నా అని ఉన్నా యంత్రంలో మాత్రం ఈ ధర నమోదు అవుతుంది. ఈ జీరో టిక్కెట్ల మొత్తం విలువను ఆర్టీసీ అధికారులు లెక్కకట్టి రీయింబర్స్‌మెంట్ కోసం ప్రభుత్వం ముందుంచుతున్నారు.
పొరుగు రాష్ట్రాల్లో పథకం అమలు ప్రారంభమయ్యాక బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 65 - 70 శాతం నుంచి 95 శాతానికి పెరిగిందని లెక్క తేల్చారు. దీంతో, ప్రభుత్వం ఆగస్టు 15 ఈ పథకం ప్రారంభం దిశగా అడుగులు వేస్తోంది. సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications