విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కుప్పకూలిన వందేళ్ల భవనం: ప్రాణాల కోసం పరుగు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నగరంలో బుధవారం పెను ప్రమాదం తప్పింది. 25వ వార్డులో ఓ పాత భవనం బుధవారం ఒక్కసారిగా కూలిపోయింది. కూలుతున్న శబ్ధానికి నివాసముంటున్న వారు పరుగుపరుగున బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని కందులవారివీధిలో సుమారు వందేళ్ల క్రితం నిర్మించిన రెండస్థుల పురాతన భవనం ఉంది. ఈ భవనంలో నాలుగు పోర్షన్లు ఉన్నాయి.

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భవనం పూర్తిగా తడిసి ముద్దవడంతో బుధవారం ఉదయం 8.45 గంటలకు రెండు అంతస్థుల్లోనూ ఒకవైపు ఉన్న గదులు పూర్తిగా నేలమట్టమయ్యాయి.

కుప్పకూలిన భవనం

కుప్పకూలిన భవనం

విశాఖపట్నం నగరంలో బుధవారం పెను ప్రమాదం తప్పింది. 25వ వార్డులో ఓ పాత భవనం బుధవారం ఒక్కసారిగా కూలిపోయింది.

కుప్పకూలిన భవనం

కుప్పకూలిన భవనం

కూలుతున్న శబ్ధానికి నివాసముంటున్న వారు పరుగుపరుగున బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు.

కుప్పకూలిన భవనం

కుప్పకూలిన భవనం

వివరాల్లోకి వెళితే.. వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని కందులవారివీధిలో సుమారు వందేళ్ల క్రితం నిర్మించిన రెండస్థుల పురాతన భవనం ఉంది. ఈ భవనంలో నాలుగు పోర్షన్లు ఉన్నాయి.

కుప్పకూలిన భవనం

కుప్పకూలిన భవనం

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భవనం పూర్తిగా తడిసి ముద్దవడంతో బుధవారం ఉదయం 8.45 గంటలకు రెండు అంతస్థుల్లోనూ ఒకవైపు ఉన్న గదులు పూర్తిగా నేలమట్టమయ్యాయి.

కుప్పకూలిన భవనం

కుప్పకూలిన భవనం

కందుల బాలసుబ్రమణ్యం గుప్తాకు చెందిన ఈ రెండు గదుల్లో నలందాస్‌ బిలాని, రామకుమారి దంపతులు, కంచర్ల భవనారాయణ, రత్నకుమారి దంపతులు అద్దెకు నివాసముంటున్నారు.

కుప్పకూలిన భవనం

కుప్పకూలిన భవనం

భవనం కూలుతోందనన్న శబ్ధాన్ని గ్రహించి వీరంతా హుటాహుటిన బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకోగలిగారు. దీంతో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ప్రమాదంలో బీరువాలు, టీవీ, ఇతర సామగ్రితో పాటు భవనం పక్కనే ఉన్న ఒక దుకాణం, ఓ రిక్షా నుజ్జునుజ్జయ్యాయి.

English summary
Old building collapsed in Vizag on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X