మళ్లీ పాత ట్రెండ్ లోకి.. ముఖ్యమంత్రి చంద్రబాబు!?
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మళ్లీ పాత ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. ఇన్నాళ్లూ పరిపాలనపైనే దృష్టి కేంద్రీకరించిన ఆయన తిరిగి ఆకస్మిక తనఖీలు మొదలుపెట్టారు.
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మళ్లీ పాత ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రిగా గతంలో ఆయన ఆకస్మిక తనిఖీలతో అధికారుల గుండెల్లో దడ పుట్టించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సారి మాత్రం పారిపాలనపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించిన చంద్రబాబు ఆకస్మిక తనిఖీలకు కాస్త దూరంగానే ఉన్నారు. ఏడాది క్రితం ఓసారి ఆకస్మిక తనిఖీలు చేపట్టినా ఆ తరువాత దాన్ని కొనసాగించలేదు.

ఇప్పుడు తాజాగా మళ్లీ తన పాత ట్రెండ్ కు తెరతీశారు చంద్రబాబు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి విజయవాడలోని పలు ప్రాంతాలను ఆయన తనిఖీ చేశారు. గవర్నర్ పేటలోని ఆర్టీసీ-2 డిపో, కంట్రోల్ రూమ్ సమీపంలోని స్క్రాప్ పార్క్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
పాత బస్టాండు వద్ద ఉన్న పార్కులో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పార్కు కాలువ గట్టుపై పచ్చదనం, సుందరీకరణ పనులను కూడా ఆయన పరిశీలించారు.
ఆ తర్వాత బస్టాండులోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు తనిఖీలను కొనసాగించారు. ఈ క్రమంలో విజయవాడ నగరంలోని పలు అభివృద్ధి పనులను కూడా ఆయన తనిఖీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications