మరోసారి ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ.. ఎప్పుడు, ఎందుకు అంటే ?
ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఈసారి ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఈ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది యోగా దినోత్సవ థీమ్ 'యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్' కాగా.. రాష్ట్రంలో 'యోగాంధ్ర - 2025' అనే పేరుతో ప్రచారం నిర్వహించాలని సీఎం సూచించారు.
మే 21 నుంచి జూన్ 21 వరకు 'యోగా మంత్'..
ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా మే 21 నుంచి జూన్ 21 వరకు 'యోగా మంత్' పాటించాలని సీఎం ఆదేశించారు. ఈ ఒక్క నెల కాలంలో ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలలు, కళాశాలల్లో యోగా అంశంపై అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నదే ప్రభుత్వ ధ్యేయం.

ఇక స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ప్రకారం.. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన కార్యక్రమం విశాఖపట్నంలో జరుగనుంది. ప్రధానిగా మోడీ సైతం ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన నేపధ్యంలో ప్రధాని పర్యటన దృష్ట్యా ఐదుగురు మంత్రులతో నిర్వాహక కమిటీ ఏర్పాటు చేశారు. హోం శాఖ, ఆరోగ్య, టూరిజం, సాంఘిక సంక్షేమ, మానవ వనరుల శాఖ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ కన్వీనర్‌గా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణబాబును నియమించారు.
రీసెంట్ గానే అమరావతిలో జరిగిన పునఃనిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు మోడీ. పలు పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి అని ప్రధాని అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌కు ఇది శుభ సంకేతమని చెప్పారు. వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. అమరావతి నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని.. రాష్ట్రంలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుందని వ్యాఖ్యానించారు.
ఏపీని ఆధునిక ప్రదేశ్, అధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉందన్నారు. యువత కలలు సాకారమయ్యే రాజధానిగా ఈ నగరం ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ, ఏఐ సహా అన్ని రంగాలకూ అమరావతి గమ్య స్థానంగా మారుతుందని కొనియాడారు.












Click it and Unblock the Notifications