ఖాళీ చెయ్యాలని చంద్రబాబు నివాసానికి నోటీసిచ్చిన అధికారులు .. ఏ క్షణంలో అయినా..
గత కొద్ది రోజులుగా వర్షాల కారణంగా కృష్ణా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి తీవ్రంగా ఉంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండున్నర లక్షల క్యూసెక్కుల వరద నీరు ఉన్నట్లుగా అధికారిక అంచనా. ఈ క్రమంలో కృష్ణానది కరకట్ట వెంబడి ఉన్న నివాసాలకు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు ఇంటితో సహా మరో 36 ఇళ్లకు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ నోటీసులిచ్చారు.
అధికారులు జారీ చేసిన నోటీసులలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ,కరకట్ట మీద ఇళ్ళను ఖాళీ చేయాలని పేర్కొన్నారు.

ఏ క్షణమైనా వరద ఇంట్లోకి రావచ్చని చంద్రబాబు ఇంటిని వరద నీరు ముంచెత్తే అవకాశం ఉన్నందున ఇంటిని ఖాళీ చేయాలని అధికారులు ఆ నోటీసులో పేర్కొన్నారు. గతంలోనూ చంద్రబాబు ఇంటికి వరద నీరు పోటెత్తడంతో ఇంటిని ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు తాజాగా మరోమారు నోటీసు ఇచ్చారు
. ఎగువన విపరీతంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో ఆరు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications