ఒకే నగరం.. ఒకే సంబరం: అంబరాన్ని తాకేలా
ఆధ్యాత్మికత, సాంస్కృతిక వైభవం, భక్తి, భిన్నత్వం కలగలిపిన విజయవాడ నగరంలో ఈ ఏడాది జరిగే దసరా ఉత్సవాలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి అలంకార దర్శనాలు మరింత గొప్పగా నిలిపేలా "విజయవాడ ఉత్సవ్ పేరిట వినూత్న కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ శ్రీకారం చుట్టారు.
ప్రజలందరికీ ఒకే వేదికపై సాంస్కృతిక ఉత్సాహం, వినోదం, సంప్రదాయం, ఆధునికత" అన్న నినాదంతో ప్రారంభమైన ఈ మహోత్సవం సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు పది రోజులపాటు ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వ సహకారంతో ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఉత్సవ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.

నగరం నలుమూలల వేదికలు..
"ఒకే నగరం - ఒకే సంబరం" అనే నినాదంతో ప్రభుత్వ సహకారం, ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజా ప్రతినిధుల సమన్వయంతో ఎంపీ కేశినేని శివనాథ్ రూపకల్పన చేసిన విజయవాడ ఉత్సవ్ ఈ ఏడాది దసరా ఉత్సవాలకు మరింత శోభను తీసుకొచ్చింది. నగరం నలుమూలలా వేదికలు సిద్ధమవుతున్నాయి. పున్నమి ఘాట్, తుమ్మలపల్లి కలాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాల, ఎంజీ రోడ్, విజయవాడ ప్రదర్శన స్థలం.. ఇలా ప్రతీచోటా వేర్వేరు అనుభూతులు కలిగించే ప్రదర్శనలు, గానవిందులు, నృత్యాలు, జానపద కళలు, ప్రజా క్రీడలు నగర వాసులతోపాటు, భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదకరం పంచనున్నాయి.
సంగీతం - నృత్యం - కళల వైభవం..
ప్రభుత్వ సహకారంతో ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో పున్నమి ఘాట్ వద్ద చంద్రకాంతి కచేరీ నుండి కర్నాటక గానసాంప్రదాయం వరకూ పది రోజుల పాటు సంగీత సంబరం. అభిజిత్ నాయర్, మాధురి, కామాక్షి, అభిలిప్సా, సందీప్ నారాయణ్, కారుణ్య వంటి ప్రముఖుల గానవిందులు భక్తులను, శ్రోతలను అలరించనున్నాయి.
తుమ్మలపల్లి కలాక్షేత్రం - ఘంటసాల సంగీత కళాశాల వద్ద..
ఇక్కడ సంప్రదాయానికి ఊతమిచ్చే ప్రదర్శనలు జరగనున్నాయి. వాటిలో సంప్రదాయ నృత్యాలు, భక్తి సంగీత కచేరీలు, జానపద నాటకాలు, బుర్రకథలు, పద్య నాటకాలు, పౌరాణిక నాటకాలను ప్రదర్శిస్తారు. ఈ వేదికలు తెలుగు సంస్కృతికి జీవం పోసేలా ప్రభుత్వ సహకారంతో ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఉత్సవ్ కమిటీ సభ్యులు పూనుకున్నారు.
విజయవాడ ప్రదర్శన వేదిక వద్ద..
సంగీత మాస్ట్రోలు మణిశర్మ, ఆర్.పీ. పాట్నాయక్, కార్తిక్, గీతా మాధురి గానామృతాన్ని అందించనున్నారు.
ఇక "విజయవాడ కిరీటం" (మహిళలు, పురుషులు), "విజయవాడ అవార్డులు", "విజయవాడ మహిళా శక్తి సత్కారం" వంటి ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి.
వినోదం - ఆకర్షణలు..
ఈ ఉత్సవం కేవలం సంగీతం, నృత్యం వరకే పరిమితం కాకుండా కుటుంబాలందరికీ వినోదం అందించేలా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ రూపుదిద్దారు. గొల్లపూడి సమీపంలోని సువిశాలమైన మైదానంలో చేపట్టిన ఎగ్జిబిషన్ పనులు తుది దశకు చేరుకున్నాయి.
భక్తులకు కన్నుల పండుగ..
అమ్మవారి ప్రత్యేక దర్శనం, నీటి క్రీడలు, డ్రోన్ ప్రదర్శనలు, ఆకాశ దీపావళి, హెలికాప్టర్ విహారం, మహా ఊరేగింపు, పిల్లలకు వినోద పార్కులు, ఆటవిడుపు కేంద్రాలు, ఆహార ప్రదర్శనలు, పందిళ్లు, ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక అనుభవం కలిగేలా అన్ని రంగాలూ కలగలిపి ఈ మహోత్సవం రూపుదిద్దుకుంది.
ప్రత్యేక సత్కారాలు - ప్రజల గౌరవం..
యువతలో ప్రతిభను వెలికి తీసేందుకు మహిళలు పురుషులకు వేరువేరుగా విజయవాడ కిరీటం, విజయవాడ కీర్తి అవార్డులు, విజయవాడ మహిళా శక్తి సత్కారం విజయవాడ గానం, ఒంటి కార్యక్రమాలు కార్యక్రమాలు జరిగే ఈ వేదిక ప్రజల హృదయాలను గెలుచుకోనుంది.
ప్రజా పండుగకు రూపకర్త..
ప్రజలు ఆనందంగా ఉండాలి, సంస్కృతిని కాపాడుకోవాలి, ఆధునికతతో సమానంగా సంప్రదాయాన్ని కొనసాగించాలి" - అనే ఆలోచనతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఈ మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఆయన కృషితో విజయవాడ నగరం భక్తి, భోగం, సాంస్కృతిక వైభవం అన్నీ కలిసిన ఒక ఉత్సవ నగరంగా పండుగ శోభను సంతరించుకుంది.
విజయవాడకు గర్వకారణం..
ఈ దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవం కేవలం రాష్ట్రానికే కాకుండా దేశమంతటికీ ఒక గర్వకారణం కానుంది. సంగీతం, నృత్యం, జానపదం, భక్తి, వినోదం అన్నీ కలిసిన ఈ మహోత్సవం ప్రపంచంలోనే అతి పెద్ద సాంస్కృతిక పండుగగా నిలిచే అవకాశం ఉంది.
ఎంపీ కేశినేని శివనాథ్ కు సీఎం చంద్రబాబు కితాబు..
విజయవాడ ఉత్సవ్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజా ప్రతినిధులు, కమిటీ సభ్యులు శుక్రవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ ఉత్సవ్ ఆహ్వాన పత్రికను అందజేసిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కమిటీ సభ్యుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
గతంలో వెలుగులు విరజిమ్మిన విజయవాడ నగరం .. గత వైఎస్ఆర్సిపి పాలకుల నిర్వాహకంతో చీకట్లో అలుముకున్నాయని, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ శ్రీకారం చుట్టిన విజయవాడ ఉత్సవ్ తో నగరంలో వెలుగులు నింపుతుందని సీఎం చంద్రబాబు కితాబు ఇవ్వడం ఈ ఉత్సవాల ప్రాముఖ్యతను చాటి చెబుతోంది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications