ఇంటికి పెద్దోడు.. పవన్ సభలో దుర్మరణం, కంటతడి పెట్టించే నేపథ్యం

కాకినాడ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అతను వీరాభిమాని. అదే అభిమానాన్ని పవన్ రాజకీయాల మీద కూడా చాటుకున్నాడు. కాకినాడలో సభ అనగానే పవర్ స్టార్ సభకు ఎలాగైనా హాజరుకావాలనే ఉద్దేశంతో.. కాకినాడ సభకు హాజరయ్యాడు. కానీ దురదృష్టం అతన్ని వెక్కిరించింది. పవన్ సభ సందర్బంగా జరిగిన ప్రమాద ఘటనతో ఆ అభిమాని దుర్మరణం పాలయ్యాడు.

ఆ అభిమాని పేరు నందికోళ్ళ వెంకటరమణ(22). కాజులూరు పరిధిలో ఉన్న కుయ్యేరు నివాసి. వెంకటరమణ దుర్మరణం నేపథ్యంలో.. కూలీ పని చేసుకునే అతని కుటుంబ పరిస్థితి ఇప్పుడు మరింత సంక్షోభంలో పడింది. వృత్తిరీత్యా రీత్యా వెంకట రమణ స్థానికంగా ఓ పెయింటర్ గా పనిచేస్తున్నాడు. అతడికి తల్లి తండ్రి, సోదరి, తమ్ముడు ఉన్నారు. కాగా సోదరి చిన్నప్పటి నుంచే మూగ.

తండ్రి తరువాత ఆ కుటుంబ భారాన్ని మోసే పెద్ద దిక్కుగా ఉన్న వెంకటరమణ దుర్మరణం.. ఇప్పుడా కుటుంబాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. కూలీ లేని రోజు పస్తులే ఉండాల్సిన పరిస్థితుల్లో రెక్కల కష్టాన్ని నమ్ముకుని బ్రతుకుతున్న కుటుంబం వారిది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం తన పెద్ద కొడుకును కోల్పోవడం.. తల్లిదండ్రులను శోక సంద్రంలో ముంచింది.

One dead, three injured at pawans seemandhra pride meeting in kakinada

ఇక వెంకట రమణ అభిమానం విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ అంటే ఎనలేని అభిమానం పెంచుకున్న వెంకటరమణ గ్రామంలో ఎప్పుడూ పవనిజం టీ షర్టులు వేసుకునే తిరిగేవాడు. వృత్తిరీత్యా పెయింటర్ కావడంతో.. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పలు పోస్టర్లు, బ్యానర్ల పని చేస్తున్నాడు. శుక్రవారం నాడు కాకినాడ సభకు హాజరయిన పలువురు అభిమానులకు బ్యానర్లు రాయడంతో పాటు జెండాలకు రంగులద్దినట్టు సమాచారం.

ఇదే క్రమంలో.. ఆరాధ్య నటుడి ప్రసంగం ఆసాంతం విని తరించాలనే ఆత్రుతతో పవన్ సభకు చేరుకున్నాడు వెంకటరమణ. అయితే ప్రసంగం మధ్యలోనే విద్యుత్ షాక్ కు గురవడంతో.. క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు వెంకటరమణ. అభిమానం పేరిట ఓ నిండు ప్రాణం బలైపోవడం ఇప్పడు అందరిని ఆవేదనకు గురిచేస్తోన్న అంశం. ఇకపోతే వెంకటరమణతో పాటు సభలో మరో ముగ్గురు అభిమానులు గాయాలపాలైనట్లు సమాచారం.

అభిమాని ఎలా చనిపోయాడు:

నిన్నటి కాకినాడ సభకు పాతికేళ్లలోపు యువకులు సభకు అధిక స్ధాయిలో రావడంతో పవన్ సభ యువత నినాదాలతో మోరు మోగింది. పవన్‌కళ్యాణ్‌ ప్రసంగాన్ని అందరికన్నా తామే ముందు వీక్షించాలనే ఆతృతతో చాలామంది యువకులు ఎక్కడైనా కాస్త ఎత్తు కనిపిస్తే చాలు.. వాటిపైకి ఎక్కే ప్రయత్నం చేశారు.

ఇదే క్రమంలో.. జేఎన్టీయూ ఇండోర్‌ స్టేడియం వెనక వైపున రెండు అంతస్థుల పైన ఉన్న కిటీకి పైకి ఎక్కుతున్న వెంకటరమణ ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ ను తాకడంతో షాక్ గురై అమాంతం కిందపడిపోయాడు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+