వెంటాడిన కుక్క: పైనుంచి దూకి ఇద్దరు మృతి, కుటుంబ సభ్యుల రోదన (ఫోటోలు)
అమరావతి: విశాఖలో దారుణం జరిగింది. ఓ పెంపుడు కుక్క ఇద్దరు కూలీల ప్రాణాల్ని బలిగొంది. ఒక్కసారిగా మీదపడి బీభత్సం సృష్టించడంతో ఇంట్లో పని చేస్తున్న కూలీలు దిక్కుతోచని స్థితిలో తలో దిక్కుకు పరిగెత్తారు. చివరికి ప్రాణాల్ని దక్కించుకోవడానికి మూడో అంతస్తు నుంచి కిందికి దూకేశారు.
విశాఖలోని అక్కయ్యపాలెంలోని లలితానగర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో కూలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గురువారం ఉదయం చోటు చేసుకున్న ఈ సంఘటన విశాఖపట్నంలో కలకలం రేపింది. విశాఖ నాలుగో టౌన్ పోలీసులు, కూలీల బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
లలితానగర్‌కు చెందిన వెలమ సంక్షేమ సంఘం నాయకుడు నరవ రాంబాబు ఇంట్లో సుమారు 10 మంది కూలీలు పెయింటింగ్, వడ్రంగి తదితర పనులు చేస్తున్నారు. మధ్యాహ్నాం 12 గంటల సమయంలో రాంబాబు పెంపుడు కుక్క (రాణి) ఒక్కసారిగా వారిపై ఎగబడింది.
దీంతో కొంతమంది కూలీలు లోపల ఉన్న గదుల్లోకి వెళ్లిపోగా.. ముగ్గురు కూలీలు ఏ గదిలోకి వెళ్లలేక కుక్క కరుస్తుందన్న భయంతో మూడో అంతస్తు వరండాలో నుంచి ఒకరి తర్వాత మరొకరు కిందకి దూకేశారు. వీరిలో అక్కయ్యపాలెంలోని చిన్నూర్ మసీదు ప్రాంతానికి చెందిన గోపి (28) అక్కడికక్కడే మృతి చెందాడు.
మహ్మద్ హుస్సేన వల్లీ (44) తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యహ్నాం 2.30 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. అక్కయ్య పాలెం శ్రీనివాసనగర్‌కు చెందిన బోనెల శ్రీనివాసరావు (25) తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కుక్క గొలుసు తాలుకూ హుక్కు ఊడిపోవడంతో అది ఇంట్లోకి వచ్చిందని, దాంతో వారంతా భయపడి పరుగులు తీశారని ఇంటి యజమాని రాంబాబు ఘటన అనంతరం విలేకరులతో చెబుతున్నారు.

3 అంతస్తు నుంచి దూకారు: కుక్క భయం ఇద్దరి ప్రాణాలు తీసింది
విశాఖలో దారుణం జరిగింది. ఓ పెంపుడు కుక్క ఇద్దరు కూలీల ప్రాణాల్ని బలిగొంది. ఒక్కసారిగా మీదపడి బీభత్సం సృష్టించడంతో ఇంట్లో పని చేస్తున్న కూలీలు దిక్కుతోచని స్థితిలో తలో దిక్కుకు పరిగెత్తారు. చివరికి ప్రాణాల్ని దక్కించుకోవడానికి మూడో అంతస్తు నుంచి కిందికి దూకేశారు.

3 అంతస్తు నుంచి దూకారు: కుక్క భయం ఇద్దరి ప్రాణాలు తీసింది
విశాఖలోని అక్కయ్యపాలెంలోని లలితానగర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో కూలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గురువారం ఉదయం చోటు చేసుకున్న ఈ సంఘటన విశాఖపట్నంలో కలకలం రేపింది. విశాఖ నాలుగో టౌన్ పోలీసులు, కూలీల బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

3 అంతస్తు నుంచి దూకారు: కుక్క భయం ఇద్దరి ప్రాణాలు తీసింది
లలితానగర్‌కు చెందిన వెలమ సంక్షేమ సంఘం నాయకుడు నరవ రాంబాబు ఇంట్లో సుమారు 10 మంది కూలీలు పెయింటింగ్, వడ్రంగి తదితర పనులు చేస్తున్నారు. మధ్యాహ్నాం 12 గంటల సమయంలో రాంబాబు పెంపుడు కుక్క (రాణి) ఒక్కసారిగా వారిపై ఎగబడింది.

3 అంతస్తు నుంచి దూకారు: కుక్క భయం ఇద్దరి ప్రాణాలు తీసింది
దీంతో కొంతమంది కూలీలు లోపల ఉన్న గదుల్లోకి వెళ్లిపోగా.. ముగ్గురు కూలీలు ఏ గదిలోకి వెళ్లలేక కుక్క కరుస్తుందన్న భయంతో మూడో అంతస్తు వరండాలో నుంచి ఒకరి తర్వాత మరొకరు కిందకి దూకేశారు. వీరిలో అక్కయ్యపాలెంలోని చిన్నూర్ మసీదు ప్రాంతానికి చెందిన గోపి (28) అక్కడికక్కడే మృతి చెందాడు.
3 అంతస్తు నుంచి దూకారు: కుక్క భయం ఇద్దరి ప్రాణాలు తీసింది
దీంతో కొంతమంది కూలీలు లోపల ఉన్న గదుల్లోకి వెళ్లిపోగా.. ముగ్గురు కూలీలు ఏ గదిలోకి వెళ్లలేక కుక్క కరుస్తుందన్న భయంతో మూడో అంతస్తు వరండాలో నుంచి ఒకరి తర్వాత మరొకరు కిందకి దూకేశారు. వీరిలో అక్కయ్యపాలెంలోని చిన్నూర్ మసీదు ప్రాంతానికి చెందిన గోపి (28) అక్కడికక్కడే మృతి చెందాడు.

3 అంతస్తు నుంచి దూకారు: కుక్క భయం ఇద్దరి ప్రాణాలు తీసింది
మహ్మద్ హుస్సేన వల్లీ (44) తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యహ్నాం 2.30 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. అక్కయ్య పాలెం శ్రీనివాసనగర్‌కు చెందిన బోనెల శ్రీనివాసరావు (25) తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

3 అంతస్తు నుంచి దూకారు: కుక్క భయం ఇద్దరి ప్రాణాలు తీసింది
కుక్క గొలుసు తాలుకూ హుక్కు ఊడిపోవడంతో అది ఇంట్లోకి వచ్చిందని, దాంతో వారంతా భయపడి పరుగులు తీశారని ఇంటి యజమాని రాంబాబు ఘటన అనంతరం విలేకరులతో చెబుతున్నారు.

Click it and Unblock the Notifications