వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూ...నిర్మానుష్యంగా రోడ్లు, తెలంగాణా బస్సులు ఏపీ సరిహద్దు వరకే !!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ కొనసాగుతోంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమండ్రి ,ఏలూరు సహా పలు పట్టణాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.ఈ నెల 18 వరకు కర్ఫ్యూ అమలు చేయనున్న నేపథ్యంలో రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.

ఏపీలో ఆ పరీక్షలు కూడా రద్దు చెయ్యాలన్న లోకేష్ .. సీఎం వైఎస్ జగన్ కు లేఖ, స్పందిస్తారా?ఏపీలో ఆ పరీక్షలు కూడా రద్దు చెయ్యాలన్న లోకేష్ .. సీఎం వైఎస్ జగన్ కు లేఖ, స్పందిస్తారా?

 ఏపీలో కర్ఫ్యూ దృష్ట్యా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టిన అధికారులు

ఏపీలో కర్ఫ్యూ దృష్ట్యా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టిన అధికారులు

ప్రజలెవరూ బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు అధికారులు. ఇక ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వివిధ వర్తక,వాణిజ్య సంస్థలు,దుకాణాలు కార్యాలయాలు, రెస్టారెంట్లు నిర్వహించుకునేలా అనుమతినిచ్చారు. అదే సమయంలో 144సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు.ఉదయం 12 గంటల తర్వాత ప్రైవేటు వాహనాలతో సహా ప్రజా రవాణాను సైతం నిలిపివేస్తున్నారు. అత్యవసర సర్వీసులను మాత్రమే నడిపించడానికి నిర్ణయం తీసుకున్నారు.

Recommended Video

#AP #Curfew ఏపీ అంతటా కర్ఫ్యూ అమలు కొనసాగుతుందిలా..!
 కర్ఫ్యూ నుండి అత్యవసర సేవల రంగాలకు మినహాయింపు

కర్ఫ్యూ నుండి అత్యవసర సేవల రంగాలకు మినహాయింపు

నేటి నుండి అమలవుతున్న పాక్షిక లాక్ డౌన్ లో అత్యవసర విభాగాల్లో పని చేసే వారికి, సేవల రంగాలలో పనిచేస్తున్న వారికి, ఆసుపత్రులు, ల్యాబ్ లు, షాపులు మరియు కొన్ని అత్యవసర సేవలకు మాత్రమే ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. మిగతా వ్యక్తులు కర్ఫ్యూ సమయంలో బయట తిరగడానికి వీల్లేదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి బయట తిరిగితే కేసులు నమోదు చేస్తామని, వాహనాలను సీజ్ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

 ఏపీలో కర్ఫ్యూ కారణంగా టిఎస్ఆర్టిసి పలు కీలక నిర్ణయం .. సరిహద్దుల వరకే బస్సులు

ఏపీలో కర్ఫ్యూ కారణంగా టిఎస్ఆర్టిసి పలు కీలక నిర్ణయం .. సరిహద్దుల వరకే బస్సులు

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి దృష్ట్యా విధించిన కర్ఫ్యూ కారణంగా టిఎస్ ఆర్టిసి పలు చర్యలకు ఉపక్రమించింది. దూర ప్రాంతాలకు నడిచే అన్ని బస్సు సర్వీసుల రిజర్వేషన్లను రద్దు చేసింది .ఏపీలో కర్ఫ్యూ దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సరిహద్దుల వరకే టీఎస్ ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ఈ రోజు నుంచి ఈ నెల 18వ తేదీ వరకు ముందస్తు రిజర్వేషన్లు నిలిపివేసింది.

ఏపీలో నిర్మానుష్యంగా రోడ్లు .. తొలిరోజు ప్రజలు ఇళ్లకే పరిమితం

ఏపీలో నిర్మానుష్యంగా రోడ్లు .. తొలిరోజు ప్రజలు ఇళ్లకే పరిమితం

టిఎస్ ఆర్టిసి 12:00 లోపు గమ్య స్థానాలకు చేరుకునే దూరప్రాంత బస్సులకు, అది కూడా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏది ఏమైనా కరోనా కట్టడి కోసం ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఏపీలో రోడ్లు నిర్మానుష్యంగా తయారయ్యాయి. ప్రజలు తొలిరోజు ఇళ్లకే పరిమితం అయ్యారు. అత్యవసరాలు మినహాయించి రవాణా ఎక్కడికక్కడ స్తంభించింది .

English summary
The curfew continues in Andhra Pradesh in the wake of the corona boom. Vijayawada, Visakhapatnam, Tirupati, Guntur, Rajahmundry and Eluru, roads have become impassable. At the same time,Telangana RTC has decided to run buses up to the AP border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X