తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఒంగోలు కోర్టు నోటీసులు!
ప్రకాశం: తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌తో పాటు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, అప్పటి ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏకే ఖాన్.. అక్టోబర్ 3న ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా కోర్టులో హాజరు కావాలని 7వ అదనపు జిల్లా జడ్జి నోటీసులు జారీ చేసినట్లు పిటిషనర్ తెలిపారు.

ఈ మేరకు గురువారం సాయంతరం అద్దంకికి చెందిన పిటిషనర్ వేజెండ్ల సుబ్బారావు తెలిపారు. రాష్ట్ర విభజనకు ముందు కేసీఆర్‌తోపాటు కేటీఆర్, కవిత, హరీష్‌రావు, ఈటెల రాజేందర్, కోదండరాం తదితరులు ఆంధ్రులను అగౌరవపరిచారని ఆయన ఆరోపించారు.
దీనిపై అద్దంకి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వేజెండ్ల సుబ్బారావు తెలిపారు. అయితే, ఆ పిటిషన్ కోర్టు తిరస్కరించిన నేపథయంలో.. ఆయన జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications