పంతం నెగ్గించుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి..!!
మాజీ మంత్రి బాలినేని పంతం నెగ్గించుకున్నారు. వైసీపీ రీజనల్ ఇంఛార్జ్ పదవికి రాజీనామా చేసిన బాలినేని తాజాగా సొంత పార్టీలో ముఖ్యనేతలే తన పైన కుట్ర చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తన పైన నిందలు వేస్తున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇదే సమయంలో తన నియోజకవర్గంలో జరిగిన డీఎస్పీ బదిలీలపై అభ్యంతరం వ్యక్తం చేసారు. బాలినేని అభ్యంతరాలు..ప్రస్తుత పరిణామాల నడుమ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో 50 మంది డీఎస్పీలు బదిలీ : ఏపీలో 50 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా జారీ అయిన ఉత్తర్వుల్లో ఒంగోలు డీఎస్పీ టి.అశోక్ వర్ధన్ దర్శికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దర్శి డీఎస్పీ వి.నారాయణ స్వామి రెడ్డిని ఒంగోలుకు బదిలీ చేసారు.

ఒంగోలు డీఎస్పీ గా టి.అశోక్ వర్ధన్ బదిలీపై మాజీమంత్రి బాలినేని అభ్యంతరం వ్యక్తం చేశారన్న కారణంతో రెండు రోజుల వ్యవధిలో ఆయనను వెంటనే మరోసారి దర్శికి బదిలీ చేస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో, దర్శి డీఎస్పీ వి.నారాయణ స్వామి రెడ్డికి ఒంగోలు డీఎస్పీగా అవకాశం దక్కింది. ఈ ఉత్తర్వులతో డీఎస్పీ పోస్టుల బదిలీల్లో తొలగిన ప్రతిష్టంభన తొలిగినట్లు కనిపిస్తోంది.
ఒంగోలు డీఎస్పీ మార్పు : రెండు రోజుల క్రితం జారీ అయిన ఉత్తర్వుల మేరకు ఒంగోలు డీఎస్పీగా అశోక్‌వర్ధన్ రెడ్డి నియమితులయ్యారు. బాధ్యతల స్వీకరణ కోసం ఆయన గురువారం రాత్రి కార్యాలయానికి వచ్చారు. అప్పటి వరకు డీఎస్పీగా వ్యవహరించిన నాగరాజు, కార్యాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. సిమ్ కార్డు కూడా అందించారు.

ఇంతలోనే అశోక్ వర్ధన్ తప్పుకోవాలని, త్వరలో కొత్త డీఎస్పీని నియమిస్తారని మౌఖిక ఆదేశాలు అందాయి. ఈ నియమాకం పైన బాలినేని అభ్యంతరం వ్యక్తం చేసిన కారణంగానే మార్పు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఫలితంగా ఇప్పుడు తాజాగా ఊహించన విధంగానే ఒంగోలు డీఎస్పీగా వి.నారాయణ స్వామి రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
పంతం నెగ్గించుకున్న బాలినేని : కర్నూలు జిల్లాలోనూ కొన్ని నియామకాల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో పాలనా వ్యవహారాల పైన తనకు సమాచారం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని బాలినేని అసహనం వ్యక్తం చేసారు. తనకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు బాలినేని నేరుగా మీడియా ముందు తన పైన సొంత పార్టీ నేతలే కుట్ర చేస్తున్నారని ఆరోపించటంతో పార్టీలో కొత్త చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో బాలినేని అభ్యంతరాలతో రెండు రోజుల క్రితం నియమించిన డీఎస్పీని మార్చి మరొకరిని నియమించారు. దీంతో, బాలినేని పంతం నెగ్గించుకున్నట్లు అయింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications