ఒంగోలు గిత్త రివర్స్, మేయర్ తో సహ 12 మంది వైసీపీ కార్పొరేటర్లు జంప్

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపులు ఎలా జరిగాయో అదేవిధంగా ప్రస్తుతం పార్టీల పిరాయింపులు జోరుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఆకర్షితులు అవుతున్న వైసీపీ నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం, జనసేన, బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు.

ప్రకాశం జిల్లాలోని ఒంగోలు సిటీ కార్పోరేషన్ మేయర్ సుజాతతో సహ 12 మంది కార్పొరేటర్లు సామూహిక రాజీనామాలు చేయడం హాట్ టాపిక్ అయింది. గతంలో ఒంగోలులో చక్రం తిప్పిన వైసీపీకి చెందిన ఓ మాజీ మంత్రి ప్రస్తుతం సైలెంట్ అయిపోవడంతో వైసీపీ నాయకులు షాక్ అయ్యారు. ఇలాంటి పరిణామాల మధ్య వైసీపీకి చెందిన చాలామంది నాయకులు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇతర పార్టీలలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Ongolu mayor along with 12 corporators have resigned en masse from YCP

ఇదే సమయంలో ఒంగోలులో వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఒంగోలు మేయర్ పీఠం వైసీపీ చేతిలో ఉంది. ఒంగోలు కార్పొరేషన్ లో వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది. వైసీపీ మేయర్ సుజాతతో సహా ఆ పార్టీకి చెందిన 12 మంది కార్పొరేటర్లు ఆ పార్టీకి సామూహిక రాజీనామాలు చేశారు. ప్రకాశం జిల్లా నాయుడుపాలెం ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సమక్షంలో ఒంగోలు మేయర్ తో సహ ఆ పార్టీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు.

వైసీపీ తీరుతో విసిగిపోయి ఆ పార్టీకి రాజీనామాలు చేశామని ఒంగోలు మేయర్ సుజాతతో సహ వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. ఒంగోలులో ఒక్కసారిగా వైసీపీకి ఎదురు దెబ్బ తగలడంతో ఆ పార్టీ నాయకులు షాక్ అయ్యారు. ఒంగోలు తో పాటు పలుచోట్ల వైసీపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతారని తెలిసింది. అయితే ఈ విషయంపై వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో అని ఒంగోలు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+