షోరూం దగ్గరి నుంచే వాహనాల రిజిస్ట్రేషన్
ఒంగోలు: ఏపీ రవాణా శాఖలో వాహనాల రిజిస్ట్రేషన్లు, పౌర సేవలను పారదర్శకంగా నిర్వహించాలన్న ధ్యేయంతో ప్రభుత్వం చేపట్టిన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లను పక్కాగా నిర్వహించాలని మంత్రి శిద్ధా రాఘవ రావు అధికారులను ఆదేశించారు. విశాఖ జిల్లాలో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు కంపెనీ షోరూంల వద్ద నుంచే ప్రారంభించామని, తాజాగా ఒంగోలులో ఈ-ప్రగతి కార్యక్రమంలో భాగంగా కంపెనీ షోరూం నుంచి వాహనాలను ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా ప్రారంభించడం జరిగిందన్నారు.












Click it and Unblock the Notifications