ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

వైఎస్సార్ కడప జిల్లాలోని చారిత్రాత్మక ఆలయం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత కన్నుల పండుగగా జరుగుతోంది. ఈ మహాద్భుతమైన ఘట్టంలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

ఆంధ్రా భద్రాద్రి క్షేత్రంగా కీర్తించే ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి క్షేత్రం ఎంతో ప్రాచీనమైనది. ప్రతి సంవత్సరం ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతుంటాయి. అలాగే శ్రీరామనవమి సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. సాధారణంగా అన్ని రామాలయాలలో శ్రీరామనవమికి కళ్యాణం జరిగితే ఒంటిమిట్టలో మాత్రం శ్రీరామనవమి అయిన 4 రోజులకు నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీగా వస్తోంది.

అయితే ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ కళ్యాణ మహోత్సవానికి సీఎం చంద్రబాబు దంపతులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ మహాద్భుతమైన ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దాంతో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఏర్పాటు చేసిన 120 గ్యాలరీలు భక్తజన సంద్రంగా మారాయి.

Ontimitta Kodanda Ramaswamy Kalyanam Celebrated with Grandeur CM Chandrababu Offers Silk Robes

ఇక స్వామివారి కల్యాణం అనంతరం ఒంటిమిట్ట ఆలయంలో సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది. ఆలయం నుంచి కల్యాణ వేదిక వద్దకు శోభయాత్ర కాసేపట్లో ప్రారంభంకానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+