• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్ పై చెరగని విశ్వాసం - "చేయూత" లెక్కలే ప్రామాణికం: ఆ 26 లక్షల మంది మదిలో..!!

|
Google Oneindia TeluguNews

తనది మహిళా పక్షపాత ప్రభుత్వమని సీఎం జగన్ విస్పష్టంగా ప్రకటించారు. తన పాదయాత్ర వేళ ఇచ్చిన నవరత్నాల హామీలన్నీ మహిళలకు అందిస్తూ..వారి ద్వారా కుటుంబాలకు ప్రయోజనం కలిగేలా ప్రణాళిక చేసారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేస్తున్నారు. అందులో భాగంగా..సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాల ద్వారా ప్రభుత్వం రూ 2,39,103 కోట్లు పంపిణీ చేసారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ..వారిలో విశ్వాసం పెంచుకుంటూ ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారు.

నాలుగు విడతల్లో రూ 75 వేలు

నాలుగు విడతల్లో రూ 75 వేలు

గత ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీ చేస్తామని 2014 ఎన్నికల వేళ హామీ ఇచ్చి విస్మరించింది. జగన్ తన పాదయాత్ర సమయంలో ఎన్నికల రోజు వరకు ఉన్న పొదుపు సంఘాల రుణం మొత్తాన్ని నాలుగు దఫాలుగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా వైఎస్సార్‌ చేయూత ద్వారా 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు రూ.75 వేలు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇప్పుడు మూడు విడతలు పూర్తి చేసారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలలో 45 -60 ఏళ్ల మధ్య వయస్సు ఉండే అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం పేరుతో ఏటా రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75 వేలు అందజేస్తున్నారు. ఈ పథకం ద్వారా 2020 ఆగస్టు 12వ తేదీ తొలి విడతలో 24,00,111 మందికి రూ.4,500.21 కోట్లు.. 2022 జూన్‌ 22న రెండో విడతగా 24,95,714 మందికి రూ.4,679.49 కోట్లు పంపిణీ చేసింది.

26 లక్షల మంది - రూ 14,110 కోట్లు

26 లక్షల మంది - రూ 14,110 కోట్లు

మూడో విడతగా ఈ నెల 23 న చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం కేంద్రం గా సీఎం జగన్ రూ 4,949 కోట్ల నిధులు విడుదల చేసారు. మొత్తంగా 26 లక్షల 39 వేల 703 మంది లబ్ది దారులకు మూడో విడతగా 4,949 కోట్లు విడుదల చేయగా, ఇప్పటి వరకు మొత్తంగా రూ 14,110.62 కోట్లు విడుదల చేసారు. దీని ద్వారా ఒక్కో లబ్దిదారుకి రూ రూ 56,250 వేలు అందించారు.

ఇక, ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల్లో భాగస్వాములుగా ఉన్న మహిళలకే రెండు కోట్ల 39 లక్షల రూపాయాలు అందిచటం ద్వారా..ఆ మహిళల్లో సీఎం జగన్ పైన అభిమానం పెరిగింది. అండగా నిలిచారనే మమకారం పెరుగుతోంది. తమకు ఆర్దికంగా తోడ్పాటు అందిస్తూ ఆర్దికంగా ఉపశమనం కలిగిస్తున్నారని లబ్ది దారులు చెబుతున్నారు. చేయూత ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల ద్వారా అందిస్తున్న 11 వేల ఉత్పత్తుల టర్నోవర్‌ కోట్లలో ఉందని అధికారులు చెబుతున్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో 7,597 మంది మహిళా పారిశ్రామికవేత్తలు రూ.29.29 కోట్ల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు.

మహిళా పక్షపాత ప్రభుత్వంగా

మహిళా పక్షపాత ప్రభుత్వంగా

రెండో ఏడాది ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 12,208 రెడీమేడ్, వస్త్ర దుకాణాలు, నాన్‌ ఫార్మ్‌ లైవ్లీహుడ్‌ కింద 20,049 యూనిట్లు ఏర్పాటయ్యాయన్నారు. ఇక, సెర్ప్‌ సహకారంతో 78,066 వ్యాపారాలు, ఏజియో రిలయన్స్‌ భాగస్వామ్యంతో పదమూడు జిల్లాల్లో టెక్స్‌టైల్, అప్పారెల్, ఫుట్‌ వేర్‌ వ్యాపారాలు జరుగుతున్నట్లు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో 36,162 రిటైల్‌ షాప్‌లతో హిందూస్థాన్‌ లీవర్, ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబల్, ఐటీసీ వంటి సంస్థలతో మహిళల మధ్య వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కుదిరినట్లు చెప్పారు. 17 నెలల్లోనే రూ.783.93 కోట్ల విక్రయాలు జరిగాయని, రూ.94.07 కోట్ల నికర లాభాన్ని మహిళలు అందుకున్నారని తెలిపారు. ఇదంతా..39 నెలల కాలంలో జరిగింది.

దీంతో..ముఖ్యమంత్రి జగన్ ప్రతీ బహిరంగ సభలో తన అక్కా చెల్లమ్మలకు ఏ విధంగా తన ప్రభుత్వం సహకారం అందిస్తుందీ వివరిస్తూనే.. వారి ఆశీస్సులు తనకు కావాలని కోరుతున్నారు. ఇంత భారీ సంఖ్యలో లబ్ది పొందుతున్న మహిళలు సైతం జగన్ కు మద్దతుగా నిలుస్తామని చెబుతున్నారు.

English summary
YSR Cheyutha scheme of CM Jagan Navaratnalu helping ore than 26 lakh benificieries for rs 14, 409 cr. In Jagan Tenure about 2.39 lakh cr benifted for women in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X