సీఎం జగన్ మార్క్ "లీడర్ షిప్" - చంద్రబాబు రికార్డులు బ్రేక్ : అంబానీ ఎంట్రీతో..!!
ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం జగన్ మార్క్ వ్యూహాంతో ప్రతిపక్షాలు ఆత్మరక్షణలో పడ్డాయి.
ముఖ్యమంత్రి జగన్ చేసిన సైలెంట్ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఎన్నికల వేళ పార్టీకి జోష్ ఇచ్చింది. ప్రతిపక్షాల విమర్శలు..జగన్ నాయకత్వంపై వస్తున్న విమర్శలకు ఒక్క సదస్సుతో చెక్ పెట్టారు. తన సామర్ధ్యం ఏంటో నిరూపించుకున్నారు. దేశంలోనే పేరున్న పారిశ్రామిక దిగ్గజాలను ఒక్క చోటకు తీసుకొచ్చారు. వారితో జగన్ సన్నిహితంగా మెలిగిన తీరు ప్రత్యేకార్షణగా నిలిచింది. ఇదే సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి ఏకంగా రూ 13 లక్షలకు పైగా పెట్టబడులకు ఎంఓయూలు జరిగాయి. చంద్రబాబు గతంలో చేసుకున్న ఒప్పందాల రికార్డులను అధిగమించాయి. ఈ సదస్సు ద్వారా జగన్ మార్క్ లీడర్ షిప్ పైన జాతీయ మీడియా..పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది.

ఒక్క సదస్సుతో అన్నింటికీ సమాధానం..
ముఖ్యమంత్రి జగన్ విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సును ప్రతిష్ఠాత్మకంగా భావించారు. తొలి నుంచి సదస్సు నిర్వహణ బాధ్యతలను తానే స్వయంగా తీసుకున్నారు. పారిశ్రామిక ప్రముఖులతో తానే స్వయంగా సంప్రదింపులు జరిపారు. వారంతా విశాఖ సదస్సుకు తరలి వచ్చేలా పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ముందుగానే ఏపీలో పెట్టుబడుల పైన వారి నుంచి కమిట్ మెంట్ తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఎవరు ఏపీలో పెట్టుబడులు పెడతారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా పలువురు ఎద్దేవా చేసారు. పారిశ్రామిక వేత్తలు జగన్ ను చూసి పారిపోతున్నారంటూ వ్యాఖ్యలు చేసారు. కానీ, పారిశ్రామిక దిగ్గజాలు సీఎం జగన్ తో సన్నిహితంగా మెలిగిన తీరు.. పెట్టుబడులు ప్రకటన.. సదస్సు వేదికగా సీఎం జగన్ పైన ప్రశంసలతో ఈ ఆరోపణలు..వ్యతిరేక అభిప్రాయాలకు సమాధానం దొరికింది. జగన్ లో దాగి ఉన్న బిజినెస్ కోణం బయటకు వచ్చింది.

చంద్రబాబు రికార్డులను బ్రేక్ చేస్తూ
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ పెట్టుబడుల సదస్సులు నిర్వహించారు. చంద్రబాబు కోసం పారిశ్రామిక వేత్తలు తరలి వస్తారని..పెట్టుబడులు పెడతారంటూ కొంత కాలం క్రితం వరకు పెద్ద ఎత్తున ప్రచారం ఉండేది. చంద్రబాబు సీఎంగా గతంలో విశాఖ కేంద్రంగా నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో 10.50 లక్షల కోట్ల మేర ఒప్పందాలు జరిగాయి. ప్రముఖ కంపెనీలకు చెందిన కీలక స్థానాల్లో ఉన్న వారు హాజరయ్యారు. అదే టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. ఇప్పుడు జగన్ ఆ రికార్డులను బ్రేక్ చేసారు. ఒకే సదస్సులో రూ. 13,05,663 కోట్ల పెట్టుబడికి సంబంధించి 352 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటివల్ల 6,03,223 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అదే సమయంలో ముఖేష్ అంబానీ, కరణ్ ఆదానీ, పునీత్ దాల్మియా, సజ్జన్ భజాంక, జీఎంఆర్, హరిమోహన్ బంగూర్, సుమిత్ బిదానీ వంటి వారు తరలి వచ్చారు. అంబానీ వేదిక నుంచే సీఎం జగన్ ను ప్రశంసించారు. ఏపీలో పెట్టుబడులు ప్రకటించారు. ఇది వైసీపీ నేతలకు మరింత జోష్ ఇచ్చింది.

ఎన్నికల వేళ జగన్ మార్క్ ఆపరేషన్..
ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ముఖ్యమంత్రి సైలెంట్ ఆపరేషన్ తో ప్రతిపక్షాలు ఆత్మరక్షణలో పడ్డాయి. సదస్సు ప్రారంభమయ్యే వరకూ మంత్రులు సైతం రెండు లక్షల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనాగా చెబుతూ వచ్చారు. కానీ ఏకంగా రూ 13.05లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. ఈ సదస్సు ద్వారా జగన్ స్థాయి పెరిగిందనే విశ్లేషణలు మొదలయ్యాయి. సంక్షేమానికే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు..డెవలప్ మెంట్ ను పూర్తిగా విస్మరించారనే అభిప్రాయం ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసాయి. ఇప్పుడు ఈ పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకు రావటంలో సక్సెస్ అయిన జగన్.. వాటిని గ్రౌండింగ్ చేసేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సీనియర్ అధికారులతో టీం ఏర్పాటు చేసారు. ఎన్నికలకు సిద్దం అవుతూ అన్నింటా చంద్రబాబు వర్సస్ జగన్ అన్నట్లుగా పోటీ మారిన సమయంలో ఇప్పుడు జగన్ ఈ సదస్సు ద్వారా కొత్త రికార్డు క్రియేట్ చేసారు.












Click it and Unblock the Notifications