సీఎం జగన్ సక్సెస్ మంత్ర 2024, సర్వేల్లో తేలిందిదే - ఆపరేషన్ అపోజీషన్..!!
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తున్నారు. త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టే విధంగా సైలెంట్ ఆపరేషన్ ప్రారంభించారు. అదే సమయంలో డిసెంబర్ వరకు కార్యాచరణ ఫిక్స్ చేసారు. సంక్షేమంతో ఓట్ బ్యాంక్ సుస్థిరం చేసుకున్న జగన్..ఇప్పుడు అభివృద్ధి పైన అంచనాలకు మించి ముందుకు వెళ్లనున్నారు. తాజాగా సర్వే నివేదికలు సైతం వైసీపీ శ్రేణుల్లో జోష్ పెంచుతున్నాయి.
సీఎం జగన్ కీలక అడుగులు
ముఖ్యమంత్రి జగన్ 2024 ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకోవటానికి కీలక అడుగులు వేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గం పైన క్షేత్ర స్థాయి నుంచి మూడు రకాలుగా నివేదికలు సేకరిస్తున్నారు. అందులో అన్ని అంశాలను పరిశీలించిన తరువాత అభ్యర్ధుల ఖరారు చేయాలని డిసైడ్ అయ్యారు. గెలుపే ప్రామాణికమని తేల్చి చెబుతున్నారు.

ఇదే సమయంలో జగనన్న సురక్ష ద్వారా అర్హత ఉండీ పధకాలు అందని లబ్ది దారులను గుర్తించారు. వారికి వచ్చే నెల నుంచి పథకాలు అందించేలా నిర్ణయం ప్రకటించనున్నారు. దీని ద్వారా సంక్షేమ ఓట్ బ్యాంక్ మరింత పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో సంక్షేమం తో పాటుగా ఆగస్టు నెల నుంచి కీలక నిర్ణయాలకు కసరత్తు జరుగుతోంది.
కొత్త వ్యూహాలతో ముందుకు
ఆగస్టు నెలలో ప్రభుత్వ పరంగా ఉద్యోగాల కల్పన పైన ఫోకస్ చేయాలని నిర్ణయించారు. డీఎస్సీతో పాటుగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ..ఉద్యోగుల జోనల్ విధానం పైనా నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు టైం లైన్ సిద్దం చేసారు.
రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకు సంబంధించి డి సెంబర్ నెలాఖరులోగా మరో 36 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు క్యాలెండర్ ఖరారు చేస్తున్నారు. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాల అమలు కోసం అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. 107 ఒప్పందాల అమలు దిశగా మంతనాలు సాగుతున్నాయి. అదే సమయంలో పెండింగ్ హామీల అమలు పైన ఫోకస్ చేసారు.
అనుకూలంగా సర్వే నివేదికలు
వచ్చే ఏడాది జనవరి నుంచి పెన్షన్ ను రూ 3 వేలకు పెంచనున్నారు. ప్రతిపక్షాలు వైసీపీ లక్ష్యంగా రాజకీయంగా ఏకం అవుతున్న సమయంలో..ఆ పార్టీల నుంచి ఇప్పటికే టచ్ లోకి వచ్చిన నేతలను దశల వారీగా పార్టీలోకి చేర్చుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. దసరా నాటి నుంచి అభ్యర్ధుల ప్రకటన ప్రారంభించాలని భావిస్తున్నారు.

ఇక, ఇప్పటి వరకు వస్తున్న అన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉంటున్నాయి. జాతీయ సంస్థలు చేసిన సర్వేలు అన్నింటా వైసీపీకి 18- 20 లోక్ సభ స్థానాలు ఖాయమని తేల్చాయి. దీని ద్వారా అసెంబ్లీ సీట్ల సంఖ్య భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. విశాఖ నుంచి పాలనకు సిద్దం అవుతున్నారు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పాజిటివ్ ఓటింగే సక్సెస్ మంత్ర గా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ఇవి ఎంత మేర ఫలితం ఇస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications