ఏపీలో జగన్ కు ప్రజా మద్దతు ఎంత - తేల్చిన మెగా పీపుల్స్ సర్వే..!!

ఏపీలో ఎన్నికల వాతావరణం మొదలైంది. అధికార వైసీపీ ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. ముఖ్యమంత్రి ముందుగానే పార్టీ శ్రేణలను జనంతో మమేకం చేసే కార్యక్రమాల్లో నిమగ్నం చేసారు. అటు ప్రతిపక్ష పార్టీలు పొత్తులతో జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో ముందుకు కదులుతున్నాయి. తాను సింగిల్ గానే పోటీ చేస్తానని జగన్ ప్రకటించారు. ఇదే సమయంలో అసలు ప్రజల్లో ఎవరికి ఎంత బలం ఉందనే అంశం చర్చకు వస్తోంది. ఇదే అంశం పైన నిర్వహిస్తున్న మెగా పీపుల్స్ సర్వేలో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

జగనన్నే మా భవిష్యత్తు..: రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 'జగనన్నే మా భవిష్యత్‌' కార్యక్రమం ఈ నెల 7వ తేదీ ప్రారంభమైంది. సచివాలయానికి ముగ్గురు చొప్పున నియమించిన కన్వీనర్లు, ప్రతి 50 నుంచి వంద ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమించిన గృహ సారథులతో కూడిన ఏడు లక్షల మంది సైన్యం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, వలంటీర్లతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 14 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 15,004 సచివాలయాల పరిధిలో 1.60 కోట్ల కుటుంబాలలోని ఐదు కోట్ల మంది ప్రజలను కలుసుకోనున్నారు. దీనిని పార్టీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం రెండో విడత కొనసాగుతోంది. ఈ కార్యకమం ద్వారా ప్రజలకు జగన్ అందిస్తున్న సంక్షేమం ద్వారా ప్రభుత్వానికి- ప్రజల మధ్య సంబంధాలను మరింత దగ్గర చేయటమేనని స్పష్టం అవుతోంది.

Mega peoples survey

47 లక్షల నుంచి జగన్ కు మద్దతు : జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కార్యక్రమం కొనసాగుతోంది. జనం సీఎం వైయస్‌ జగన్‌ స్టిక్కర్లను వాకిళ్లకు ఇష్టంగా అతికించుకుంటున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగనన్న సైన్యం రాష్ట్రంలోని ప్రతి గడపకు వెళ్తున్నారని పార్టీ నేతలు వెల్లడించారు. తొలి వారంలో 61 లక్షల గృహాలను సందర్శిస్తే 47 లక్షలకు పైగా మద్దతు తెలిపినట్లు స్పష్టం చేసారు. వారంలోనే ఇంత పెద్ద ఎత్తున మద్దతు రావడం దేశంలోనే చరిత్రగా పేర్కొన్నారు. స్వచ్ఛందంగా 82960 82960 నంబర్‌కు మిస్ట్‌ కాల్‌ ఇచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఇదేదో మొక్కుబడి సర్వేగా కాకుందా.. జగనన్న సైన్యం ప్రజల వద్దకు వెళ్లి, గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను చెప్పి వాళ్ల మద్దతుతో సర్వే చేస్తున్నారు.

Mega peoples survey

మొత్తం 1.60 కోటి కుటంబాలే లక్ష్యం : మరో వారం పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. దీని ద్వారా మొత్తం కోటి 60 లక్షల కుటుంబాలను కలవటమే లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ కుటుంబాల ద్వారా దాదాపు అయిదు కోట్ల మందికి చేరువ కావాలని డిసైడ్ అయ్యారు.రాష్ట్ర భవిష్యత్‌ జగనన్నే, మన పిల్లల భవిష్యత్‌ జగనన్నతోనే అంటూ ప్రతీ ఇంటా అర్దమయ్యేలా వివరిస్తున్నారు. గత ప్రభుత్వంలో నిర్ణయాలు.. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో అమలు అవుతున్న నిర్ణయాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. ప్రతీ ఇంటికి స్టిక్కర్లు వేస్తున్నారు. అది కూడా కుటుంబ సభ్యుల అనుమతితోనే. దీంతో, ఇప్పుడు వైసీపీ నేతలంతా ఈ కార్యక్రమంలో ఏక కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ప్రజల ముందుకు వెళ్తున్నారు. ఈ సర్వే తుది నివేదిక.. ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా జగన్ ఎన్నికలకు కావాల్సిన నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+