కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ నిర్ణయం వెనక జగన్‌లో ఆ కసి ఎందుకంటే..? అసలు టార్గెట్ ఇదే

|
Google Oneindia TeluguNews

ఏపీ అసెంబ్లీ చివరిరోజున కొన్ని ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయని చెప్పకనే చెప్పారు. ఇందులో ఒకటి పరిపాలనా రాజధానిగా అమరావతి, రెండోది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం మూడోది జ్యుడిషియరీ క్యాపిటల్‌గా కర్నూలు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం దీనిపైనే చర్చ జరుగుతోంది . అయితే ఎగ్జిక్యూటివ్ క్యాపిట్‌గా విశాఖనే జగన్ ఎందుకు ఎంచుకున్నారు.. అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ ఇంట్రెస్టింగ్ డెసిషన్‌పై రాజకీయ విశ్లేషకులు కూడా ఒక్కింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Lok Satta: మా ఆలోచన, లక్ష్యం అదే: జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన జయప్రకాశ్: తొలిసారిగా..సానుకూలంగా!Lok Satta: మా ఆలోచన, లక్ష్యం అదే: జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన జయప్రకాశ్: తొలిసారిగా..సానుకూలంగా!

 డీసెంట్రలైజేషన్

డీసెంట్రలైజేషన్

ఏపీ అసెంబ్లీలో చివరి రోజు రాజధానిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కాసేపు రాజధానిపై మాట్లాడారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగించారు. డీసెంట్రలైజేషన్ పేరుతో తన ప్రసంగాన్ని ప్రారంభించి మూడు రాజధానులు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. సౌతాఫ్రికా లాంటి దేశాల్లో ఉన్నాయని అభివృద్దిని ఒక్క ప్రాంతానికే పరిమితం చేయకూడదని చెబుతూ మూడు రాజధానులు ఉండొచ్చేమో అనే చిన్న హింట్ ఇచ్చారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం దీన్ని మరో కోణంలో చూస్తున్నారు.

 విశాఖపై తన మార్కు ఉండేలా...

విశాఖపై తన మార్కు ఉండేలా...

2014 ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీచేసిన వైసీపీ గౌరవ అధ్యక్షురాలు సీఎం జగన్ తల్లి విజయమ్మ ఓటమిపాలయ్యారు. ఆ ఓటమిని జగన్ జీర్ణించుకోలేకపోయారు. అప్పట్లో విజయమ్మ విజయం సాధిస్తే విశాఖలో పులివెందుల బ్యాచ్ దిగుతుందని మొత్తం దోచేస్తారని జాగ్రత్తగా ఉండాలంటూ అప్పటి టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు ప్రచారం చేశాయి. అయితే 2019లో మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. విశాఖ సీటును ఎలాగైనా దక్కించుకోవాలన్న కసితో జగన్ అండ్ టీమ్ పనిచేసింది. చివరకు సక్సెస్ అయ్యింది. విజయసాయిరెడ్డికి విశాఖ బాధ్యతలను అప్పగించారు జగన్. ఇక విశాఖ ఎంపీ సీటుతో పాటు 11 అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలిచింది. విశాఖపట్నం పై చంద్రబాబు మార్క్ ఉండేదని దాన్ని చెరిపి విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటించడం ద్వారా సీఎం జగన్ తన మార్క్‌ను చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఉత్తరాంధ్ర బీసీ కాపు ఓటర్లే టార్గెట్టా..?

ఉత్తరాంధ్ర బీసీ కాపు ఓటర్లే టార్గెట్టా..?

ఇక ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా ముందుగా విశాఖను అభివృద్ధి చేసి పెట్టుబడులు తీసుకురావడమే సీఎం జగన్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో మొత్తం ఐదు ఎంపీ సీట్లుండగా ఒక్క శ్రీకాకుళం తప్ప మిగతా నాలుగు సీట్లను వైసీపీ గెలుచుకుంది. ఉత్తరాంధ్రలో కాపు మరియు బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వారందరినీ ఆకట్టుకునేందుకు జగన్ అత్యంత చాకచక్యంగా పావులు కదుపుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడులు పెట్టాలంటే ప్రధానంగా రవాణా సౌకర్యం ఉందా లేదా అనేది చూస్తారు. విశాఖకు రైల్ కనెక్టివిటీ, విమానాశ్రయం, పోర్టు ఎలాగూ ఉన్నాయి కాబట్టి ఈ సిటీని మరింత అభివృద్ధి చేసి ఇన్వెస్ట్‌మెంట్స్ తీసుకురావాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఏపీ ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా విశాఖకు గుర్తింపు ఉంది.

గిరిజనులకు పలు వరాలు

గిరిజనులకు పలు వరాలు

కేంద్రం విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చినప్పటికీ అందులో కొన్ని షరతులు విధించడంపై ఉత్తరాంధ్ర ప్రజలు సంతోషంగా లేరు. అదేసమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్‌లు ఉద్దానం ఇష్యూను తీసుకురావడం జగన్ అధికారంలోకి వచ్చాక ఆ సమస్యకు ముగింపు పలికి మైలేజ్ సంపాదించుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అంతేకాదు టీడీపీకి కంచుకోటగా ఉత్తరాంధ్ర ఉండేది. విజయనగరం జిల్లాను స్వీప్ చేయడంతో పాటు ఉత్తరాంధ్రలో మెజార్టీ సీట్లను వైసీపీ సాధించింది. ఈ క్రమంలోనే జగన్ ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టిసారించినట్లు సమాచారం. అందుకే అరకులో గిరిజన యూనివర్శిటీ, గిరిజనులకు ప్రత్యేక హాస్పిటల్, గిరిజనులకు ఇంజినీరింగ్ కాలేజ్‌ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్‌ను కూడా త్వరతగతిన పూర్తిచేయాలని అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

మొత్తానికి విశాఖను హైలైట్ చేస్తూ ఉత్తరాంధ్రను అభివృద్ది చేసి వచ్చే ఎన్నికల నాటికి తనదైన ముద్ర వేసుకోవాలని సీఎం జగన్ పరితపిస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేసి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అనలిస్టులు చెబుతున్నారు.

ఉత్తరాంధ్రలో తనదైన ముద్ర

ఉత్తరాంధ్రలో తనదైన ముద్ర

గతంలో టీడీపీకి కంచుకోటగా ఉత్తరాంధ్ర ఉండేది. విజయనగరం జిల్లాను స్వీప్ చేయడంతో పాటు ఉత్తరాంధ్రలో మెజార్టీ సీట్లను వైసీపీ సాధించింది. ఈ క్రమంలోనే జగన్ ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టిసారించినట్లు సమాచారం. అందుకే అరకులో గిరిజన యూనివర్శిటీ, గిరిజనులకు ప్రత్యేక హాస్పిటల్, గిరిజనులకు ఇంజినీరింగ్ కాలేజ్‌ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.

అంతేకాదు అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్‌ను కూడా త్వరతగతిన పూర్తిచేయాలని అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి విశాఖను హైలైట్ చేస్తూ ఉత్తరాంధ్రను అభివృద్ది చేసి వచ్చే ఎన్నికల నాటికి తనదైన ముద్ర వేసుకోవాలని సీఎం జగన్ పరితపిస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేసి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అనలిస్టులు చెబుతున్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధి లక్ష్యంగా

ఉత్తరాంధ్ర అభివృద్ధి లక్ష్యంగా

అభివృద్ధి దిశలో పయనించేలా విశాఖను హైలైట్ చేస్తూ ఉత్తరాంధ్రను అభివృద్ది చేసి వచ్చే ఎన్నికల నాటికి తనదైన ముద్ర వేసుకోవాలని సీఎం జగన్ పరితపిస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేసి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అనలిస్టులు చెబుతున్నారు.

English summary
In a surprising move AP CM Jagan had revealed that there might be three capitals for Andhra Pradesh where one is the Adminstrative capital Amaravati, Judiciary capital Kurnool and Executive capital as Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X