డీలిమిటేషన్ బిల్లు గట్టెక్కాలంటే, జగన్ సహా వారే కీలకం- రంగంలోకి మోదీ టీం..!!
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కీలకంగా మారాయి. రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే ప్రత్యేక సమావేశాలు ఇవి. లోక్ సభ.. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50 శాతానికి పెంచే డీలిమిటేషన్ బిల్లుతో సహా మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపేందుకు పార్లమెంట్ ప్రత్యేకంగా ఈ భేటీ ఏర్పాటు చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలుపుతామని చెబుతున్న ప్రతిపక్షం డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తోంది. దీంతో.. ఈ బిల్లుల అమోదం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఎన్డీఏ నాయకత్వం కీలక మంత్రాంగం నడుపుతోంది. జగన్ సహా ఆ పార్టీల మద్దతు కీలకంగా మారుతోంది. బిల్లుల ఆమోదం వేళ ఢిల్లీ కేంద్రంగా కొత్త లెక్కలు మొదలయ్యాయి.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన మూడు బిల్లులను కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనుంది. ప్రస్తుతం పార్లమెంట్ లో ఉన్న సంఖ్యా బలం.. పార్టీల వారీ లెక్కలు చూసిన తరువాత మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులు ఆమోదం పొందాలంటే ప్రతిపక్షానికి చెందిన దాదాపు వంద ఎంపీలను బుజ్జిగించాల్సి ఉంటుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకోసం ప్రధాని మోదీ బృందం సన్నాహాలు చేస్తోందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభలో ఎన్డీయేకు 293 మంది సభ్యుల మద్దతు ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 362 మంది సభ్యుల మద్దతు అవసరం. అంటే ఎన్డీయేకు కనీసం మరో 99 మంది సభ్యులు తక్కువవుతారు. సభకు హాజరైన వారిలో రెండింట మూడో వంతు మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే బిల్లులు ఆమోదం పొందు తాయి. ఎన్డీయేకు ఉన్న సంఖ్యా బలానికి రెండింట మూడో వంతు మెజారిటీ రావాలంటే సభలో కనీసం 439 మంది సభ్యులు ఉండాల్సిన అవసరం ఉంది.

రంగంలోకి మోదీ టీం.. కీలక మంత్రాంగం
కాగా, ఇది జరగాలంటే దాదాపు 104 మంది సభ్యులు సభకు గైర్హాజరయ్యేలా చూడడం లేదా సభకు హాజరైనా ఓటు వేయకుండా చేయడమో చెయ్యాలి. దీంతో ప్రతిపక్ష శిబిరంలో ఎంతమంది ని తమ వైపునకు నయానో భయానో తిప్పుకున్నా వందమందిని ఎలా బుజ్జగించగలమనే సందేహం బీజేపీ శ్రేణుల్లో నెలకొంది. అయితే, తామంతా సంఘటితంగా ఉన్నామని, తమను ఎవరూ ప్రలోభపెట్టలేరని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దీంతో.. తటస్థంగా ఉన్న వైసీపీ, బీజేడీ వంటి పార్టీల మద్దతు... ఇతర పార్టీల్లోని కొందరితో మంత్రాంగం సాగుతోంది. ఢిల్లీ కేంద్రంగా కీలక మంతనాలు జరుగుతున్నాయి. సభలో అనుసరించాల్సిన వ్యూహం పైన ఇప్పటికే బీజేపీ అధి నాయకత్వం ప్రణాళికలతో సిద్దమైంది. బిల్లులో వ్యూహాత్మకంగా కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ.. చర్చ వేళ కీలక అంశాల ప్రకటనకు సమాయత్తం అవుతోంది. దీంతో.. ప్రతిపక్షాలు మహిళా బిల్లు ను ఆమోదిస్తూ.. డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తామని చెబుతుండటంతో.. మహిళా బిల్లుకు లింకు చేసి మూడు బిల్లుల ఆమోదానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. దీంతో.. పార్లమెంట్ వేదికగా మూడు రోజులు చోటు చేసుకునే పరిణామాల పైన ఉత్కంఠ నెలకొంది.













Click it and Unblock the Notifications