వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీలో విజిల్ వేసిన టీడీపీ సభ్యుడు: బాంబులేసుకోండి: స్పీకర్ తమ్మినేని ఫైర్

|
Google Oneindia TeluguNews

అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనూహ్య చర్యకు దిగింది. సభలో విజిల్స్ వేసింది. ఒక్కసారి కాదు.. మూడుసార్లు విజిల్ వేసింది. స్పీకర్ తమ్మినేని సీతారాం వారిస్తున్నప్పటికీ.. వారు వినిపించుకోలేదు. ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోన్న సమయంలోనే మళ్లీ, మళ్లీ విజిల్ వేశారు తెలుగుదేశం పార్టీ సభ్యులు. దీనితో స్పీకర్- ఘాటుగా హెచ్చరించారు. బయటికెళ్లి ఇష్టం వచ్చినట్లు చేసుకోండంటూ వార్నింగ్ ఇచ్చారు.

 విద్యుత్ సబ్సీడీల గురించి మాట్లాడుతుండగా..

విద్యుత్ సబ్సీడీల గురించి మాట్లాడుతుండగా..


సభలో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వ్యవసాయ రంగానికి విద్యుత్ టారిఫ్‌లో ప్రభుత్వం ఇస్తోన్న సబ్సిడీల గురించి వివరించారు. తమ ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ వినియోగానికి సబ్సిడీ ఇస్తోందని బాలినేని చెప్పారు. రొయ్యల పెంపకం దారులు, అలాగే- ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు దీన్నివర్తింపజేసిందని అన్నారు. సబ్సిడీని అమలు చేయడం వల్ల డిస్కమ్‌లపై పడుతోన్న భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు.

టీడీపీ ఎమ్మెల్యే విజిల్..

టీడీపీ ఎమ్మెల్యే విజిల్..

ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వం డిస్కమ్‌లకు చెల్లించాల్సిన బకాయిల భారాన్ని కూడా తాము విడుదల చేస్తున్నామని అన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తోండగా.. టీడీపీకి చెందిన విజయవాడ తూర్పు నియోజకవర్గం సభ్యుడు గద్దె రామ్మోహన్ రావు విజిల్ వేశారు. దీనితో బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన ప్రసంగాన్ని మధ్యలో ఆపి వేశారు. మళ్లీ ప్రసంగాన్ని ఆరంభించబోతోండగా మరోసారి విజిల్ వేశారాయన.

 స్పీకర్ ఆగ్రహం..

స్పీకర్ ఆగ్రహం..

దీనితో స్పీకర్ తమ్మినేని జోక్యం చేసుకున్నారు. అభ్యంతరం వ్యక్తం చేశారు. సీనియర్ సభ్యుడివి అయివుండీ ఇలా ప్రవర్తించడం సరికాదని అన్నారు. మార్షల్స్‌ను పిలవండి అంటూ సిబ్బందికి సూచించారు. ఇదేమైనా ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్పీకర్ వారిస్తోన్న సమయంలోనే మళ్లీ విజిల్ వేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సభలో విజిల్స్ వేయడం సరికాదని అన్నారు. ఇది కరెక్ట్ కాదని తీవ్ర స్వరంతో చెప్పారు.

విజిల్ వేస్తారో.. బాంబులు వేసుకుంటారో..

విజిల్ వేస్తారో.. బాంబులు వేసుకుంటారో..

సభ నుంచి బయటికి వెళ్లి ఏవైనా చేసుకోండని స్పీకర్ వారికి హితవు పలికారు. ఇప్పటికే శాసనసభ బయట ఎంతో చేస్తున్నారని, అలాగే ఇది కూడా అని చురకలు అంటించారు. సభ బయటికి వెళ్లి విజిల్స్ వేసుకుంటారో.. బాంబులు వేసుకుంటారో.. ఏం చేసుకుంటారో.. చేసుకోండి.. అని అన్నారు. ఇది శాసనసభ అని, దీని గౌరవాన్ని కాపాడాలని సూచించారు. తామందరం చట్ట సభ్యులమని స్పీకర్ తమ్మినేని- పదే పదే ప్రతిపక్ష టీడీపీకి గుర్తు చేశారు. కోట్లాదిమంది ప్రజలు తమను ఎన్నుకుని పంపించిన శాసనసభ ఇది అని చెప్పారు.

నలుగురు సభ్యుల సస్పెన్షన్..

నలుగురు సభ్యుల సస్పెన్షన్..

అంతకుముందు- సభా వ్యవహారాలకు అడ్డుపడుతూ వచ్చిన నలుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అనగాని సత్య ప్రసాద్‌, వెలగపూడి రామకృష్ణ బాబు, బెందాళం అశోక్‌, కలవపూడి రాంబాబు (మంతెన రామరాజు)ను స్పీకర్‌ సస్పెండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకూ ఈ సస్పెన్షన్ కొనసాగుతుంది. జంగారెడ్డిగూడెంలో నాటుసారా మరణాలపై చర్చించాలంటూ పట్టుబట్టి- స్పీకర్ చుట్టుముట్టి నినాదాలు చేయడంతో స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు.

English summary
Opposition TDP member whistled in the House during AP Assembly budget sessions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X