ఆర్డినెన్స్: ఊరు ఆంధ్రలో, ప్రాతినిధ్యం తెలంగాణకు
హైదరాబాద్: పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడం వల్ల శాసనసభ్యుడు సున్నం రాజయ్య అనే ప్రజాప్రతినిధి అటు ఊరుకు గానీ, ఇటు తల్లికి గానీ కాకుండా పోతున్నారు. పోలవరంపై కేంద్రం ఆర్డినెన్స్ ఫలితంగా ఆయన ఊరు ఆంధ్రాలోనూ, ప్రాతినిథ్య నియోజకవర్గం తెలంగాణలోనూ కలిసిపోతున్నయి.
సాధారణ ఎన్నికల్లో సిపిఎం తరఫున భద్రాచలంలో రాజయ్య పోటీచేసి గెలిచారు. భద్రాచలం ప్రజాప్రతినిధిగా ఇంకా ఆయన ప్రమాణం కూడా చేయలేదు. కానీ, ఆయన ప్రమేయం లేకుండానే తెలంగాణ అసెంబ్లీలో సభ్యుడు కాబోతున్నారు. అదే సమయంలో ఆయన పుట్టిన ఊరు సున్నంవారి పాలెం. దాని అభీష్టంతో పని లేకుండా ఆంధ్రాలో కలిసిపోతోంది. ముంపు ప్రాంతాలుగా గుర్తించిన ఏడు మండలాల్లో ఒకటయిన వీఆర్ పురంలోనే ఈ గ్రామం ఉంది.

ఇప్పటిదాకా తెలంగాణలో, ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న భద్రాచలం ఏజెన్సీ ఇకపై సీమాంధ్రలో కలువనుంది. ఖమ్మం జిల్లాలో 46 మండలాలుండగా అందులో ఏడు సీమాంధ్రకు వెళ్లాయి. భద్రాచల రాముడు దక్కడం ఒక్కటే ఊరటగా మిగిలింది. పాపి కొండలు, శ్రీరామగిరి, శబరి, గోదావరి సంగమ ప్రదేశం ఖమ్మం చేజారిపోతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌తో సుమారు 570 ఆవాస ప్రాంతాలు, రెండు లక్షల జనాభా ఆంధ్ర ప్రాంతంలోకి వెళ్లనున్నాయి. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కూడా ఆంధ్రప్రదేశ్‌తో అనుసంధానం కానుంది. కేంద్రం ఆర్డినెన్సు ఆమోదించటంతో జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి.












Click it and Unblock the Notifications