ప్రధాని మోదీతో రాం చరణ్ ప్రత్యేక సమావేశం - అరుదైన గుర్తింపు..!!
మెగా పవర్ స్టార్ రాం చరణ్ కు అరుదైన గౌరవం దక్కనుంది. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డుతో సంబరాల్లో ఉన్న వేళ మరో సారి వార్తల్లో నిలుస్తున్నారు. ఆస్కార్ అవార్డు అందుకున్న తరువాత హీరో రాం చరణ్ ఈ రోజు ఢిల్లీలో సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ గా నిలవనుున్నారు. ప్రధాని మోదీతో పాటుగా క్రికెట్ లెజెండ్ సచిన్ తో కలిసి వేదిక పంచుకెనున్నారు. ఇండియా టుడే కాన్ క్లేవ్ లో పాల్గొననున్నారు. ఈ సాయంత్ర ప్రధానితో రాంచరణ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఆర్ఆర్ఆర్ హీరో నేరుగా ప్రధాని నుంచి సత్కారం అందుకోనున్నారు.
హీరో రాం చరణ్ ఢిల్లీలో ప్రత్యేకార్షణగా మారారు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డుతో అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ టీంకు గుర్తింపు వచ్చింది. ప్రధానితో సహా రాజకీయ - సినీ రంగ ప్రముఖులు ఆర్ఆర్ ఆర్ టీంను ప్రశంసలతో ముంచెత్తారు. ఆస్కార్ అవార్డు అందుకున్న తరువాత స్వదేశానికి చేరుకున్న హీరో రాం చరణ్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు ఆయన ఇండియా టుడే కాన్ క్లేవ్ కు హాజరవుతారు. ప్రధాని మోదీతో పాటుగా సచిన్ తో కలిసి వేదిక పంచుకుంటారు. ఈ వేదిక ద్వారా రాం చరణ్ నటుడిగా తన ప్రయాణంతో పాటుగా ఆర్ఆర్ఆర్ సినిమా..నాటు నాటు పాట వెనుక ఉన్న ఆసక్తి కర అంశాలను ప్రముఖులు .. ఆహుతులతో పంచుకోనున్నారు.

ఆర్ఆర్ఆర్ కు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కటం..ఆస్కార్ రావటం వెనుక దాగి ఉన్న కష్టాన్ని రాం చరణ్ షేర్ చేసుకొనే అవకాశం ఉంది. నాటు నాటు పాటకు ఆస్కార్ రావటం పైన ప్రధాని ఇప్పటికే ప్రత్యేకంగా టీంను ప్రశంసించారు. ఈ సాయంత్రం ప్రధాని మోదీతో రాం చరణ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ మేరకు అప్పాయింట్ మెంట్ ఖరారైంది. కొద్ది నెలల క్రితం రాం చరణ్ సతీమణి ఉపాసన ప్రధానితో సమావేశం అయ్యారు. నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు రావటంతో రాం చరణ్ ఫ్యాన్స్ హ్యాపీ మూడ్ లో ఉన్నారు. ఇక, ఇప్పుడు ప్రధానితో కలిసి వేదిక పంచుకోవటం.. ప్రధానితో ప్రత్యేకంగా సమావేశం కానుండటంతో ఫ్యాన్స్ ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఢిల్లీలో అభిమానులు రాం చరణ్ కు ఘన స్వాగతం పలికారు. నాటు నాటు పాట అందరి పాటగా అభివర్ణించారు.












Click it and Unblock the Notifications