ప్రపంచంలో ధనవంతుడు, శక్తివంతుడు వెంకటేశ్వరుడు: బాబు నవ్వించారు, సీఎంకు ఏపీ నెం.2 సంతోషం

విజయవాడ: ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ మరియు అత్యంత ధనవంతుడైన దేవుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. ఆయన విజయవాడలో రాష్ట్ర నూతన పర్యాటక విధానాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు రూపొందించిన నూతన విధానాన్ని ప్రకటించారు. వివిధ ప్యాకేజీలు, రాయితీలతో పెట్టుబడులను ఆకర్షించేలా దీన్ని తీర్చిదిద్దినట్లు చెప్పారు.

పర్యాటకం ద్వారా 5 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కొత్త విధానాన్ని రూపొందించామన్నారు. ఏపీని టూరిజం హబ్‌గా చేస్తామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పట్టిసీమలా వేగంగా పూర్తి చేయాలన్నారు. ప్యాకేజీలు, రాయితీలతో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షిస్తామని చెప్పారు.

Our Lord Venkateswara is biggest and most powerful god: Chandrababu

ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన, పవర్ ఫుల్ గాడ్ శ్రీవారు అని చెప్పారు. ఆయనకు రూ.10,000 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయన్నారు. రోజుకు వేలాది మంది భక్తులు ఆయనను దర్శించుకుంటారని, తిరుమలలో రోజుకు వేలాది మందికి అన్నదానం ఉంటుందన్నారు.

తమ కొత్త టూరిజం పారిశ్రామిక విధానంలో రూ.2 నుంచి రూ.10 వరకు రాయితీ ఇస్తామన్నారు. ఏపీకి బలం మానవ వనరులే అన్నారు. 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఉత్పత్తి రంగంలో ఓ మోస్తరు ఉద్యోగావకాశాలు కల్పించవచ్చునని, వ్యవసాయరంగంలో 42 శాతం లాభాలు సాధించవచ్చునన్నారు.

అదే పర్యాటక రంగంలో అయితే 72 శాతం లాభాలు గడించవచ్చన్నారు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. కేరళ తరహా గ్రీనరీ ఏపీకి మాత్రమే సాధ్యమన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో కోకనట్ గార్డెన్స్, పంటపొలాలు, గోదావరి నది అందాలు అద్భుతమైనవన్నారు.

అక్కడి నుంచి విశాఖకు వెళ్తే ఒకవైపు సముద్రం, ఎర్ర మట్టిదిబ్బలు, కాస్త దూరంలో అరకు అందాలు, అద్భుతమైన హిల్ స్టేషన్ ఉన్నాయన్నారు. టూరిజం వ్యాపారంలో వీటిని బాగా వినియోగించుకోవచ్చన్నారు. అలాగే రాజధానిని ప్రపంచంలోనే గొప్పగా నిర్మిస్తామని, అదోక టూరిజం స్పాట్‌గా ఏర్పడుతుందన్నారు.

అవర్ వెంకటేశ్వర స్వామి బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ అని సభికులను చంద్రబాబు నవ్వుల్లో ముంచెత్తారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేవుడు అని, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడు అన్నారు. అన్నదానం నిమిత్తం రూ.650 కోట్ల మూలధనం నిల్వలున్నాయని, ఆ డబ్బుపై వచ్చే వడ్డీతోనే రోజుకు లక్ష మంది కడుపు నింపవచ్చన్నారు.

ఇటీవల ప్రాణదానం పేరిట స్కీం ప్రారంభిస్తే రూ.250 కోట్లు వచ్చాయన్నారు. ఆయన పేరిట వివిధ ప్రాంతాల్లో గుడులు కట్టి విజయవంతం అయ్యాయని, చెన్నైలోని గుడి నుంచి రూ.25 కోట్ల ఆదాయం వస్తోందన్నారు. భక్తులను ఆశీర్వదించడంలోనే కాదు, వారి బాధలను, సమస్యలను తీర్చడంలో, భక్తితో కోరిన కోరికలను నెరవేర్చడంలో కూడా మోస్ట్ పవర్ ఫుల్ అన్నారు.

రాష్ట్రంలో రూ.కోటికి పైగా ఆదాయాన్ని తెస్తున్న దేవాలయాల సంఖ్య 160 వరకు ఉన్నాయన్నారు. ఇక రూ.25 లక్షలకు పైగా ఆదాయం వస్తున్న దేవాలయాలు మూడు వేలకు పైగానే ఉన్నాయని చెప్పారు. వీటిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

ఏపీ నెంబర్ 2: బాబుకు హ్యాపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచ బ్యాంకు తాజాగా ప్రకటించిన వ్యాపార అనుకూల వాతావరణ రాష్ట్రాలను ప్రకటించింది. ఈ జాబితాలో గుజరాత్‌కు తొలి స్థానం లభించింది. ఏపీకి రెండో స్థానం
దక్కింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+