దారుణం: గుంటూరులో హత్య చేసి.. కోటప్పకొండ వద్ద తగులబెట్టారు
గుంటూరు: నగరంలో చోటు చేసుకున్న ఓ మర్డర్ పెను కలకలం సృష్టించింది. పట్టణంలోని అరండల్ పేటలో దారుణం చోటు చేసుకుంది. మినుముల వ్యాపారం చేస్తున్న ఓ వ్యాపారి మద్యం మత్తులో తన గుమాస్తాను హత్య చేయించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివారాలిలా ఉన్నాయి.
ఓ మినుముల వ్యాపారి వద్ద పనిచేసే గుమస్తా శ్రీనివాసరావును గుర్తుతెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆ మృతదేహాన్ని నరసరావుపేటకు సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ ప్రాంతంలో శ్రీనివాసరావు మృతదేహాన్నిదుండగులు తగులబెట్టారు.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కోటప్పకొండ ప్రాంతానికి చేరుకుని మృతదేహం కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మినుముల వ్యాపారానికి సంబంధించి చోటు చేసుకున్న ఆర్థిక లావాదేవీలే ఇందుకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గుంటూరులో గ్రీనరీకి పెద్దపీట
గుంటూరు నగరంలోని పార్కులు, జంక్షన్లు, చెరువులు అభివృద్ధి చేయంలో భాగంగా జీన్ కన్సల్టెంట్స్ చైనా బృందంతో కమిషనర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఎంపిక చేయబడిన ప్రాంతాలు, పార్కులు, జంక్షన్లు, చెరువులు, స్కూళ్లలో గ్రీనరీ, వాటర్ పార్కులను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
కాకాని వై జంక్షన్ నుంచి బెస్ట్ ప్రైస్ వరకు రోడ్డుకిరువైపులా గ్రీనరీని అభివృద్ధి చేయుట, అడవి తక్కెళ్ళపాడు, బస్టాండ్ వద్దగల ఎన్టీఆర్ స్టాట్యూజంక్షన్ వద్ద, జిన్నాటవర్ సెంటర్ జంక్షన్, ఎల్‌ఎల్‌ఆర్ వాటర్ వర్క్స్, లాడ్జి సెంటర్ అంబేడ్కర్ సెంటర్ల వద్ద గ్రీనరీని అభివృద్ధి చేయుటకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications