విరక్తి: చేతులుడిగి కన్న కొడుకును చంపిన తల్లి

తల్లిదండ్రులు కిరాణా వ్యాపారం చేసుకుంటూ జీవితం నడిపిస్తున్నారు. వివాహం తెగదెంపులు కావడంతో పెద్దిరాజు మరొకరితో సహజీవనం చేస్తున్నాడు. అది కూడా తెగదెంపులు కావడంతో తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలో మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అయితే పెద్దిరాజు జీవనోపాధి కోసం తల్లి ఇప్పటికి ఆరు ఆటోలు కొని ఇచ్చింది. వాటిని అమ్మి మళ్లీ ఆటో కావాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తేవడంతో ఒక మినీ వ్యాన్‌ను కొని ఇవ్వడంతో దాన్ని కూడా అమ్మేశాడు. దీంతో తల్లి కుమారుడి తీరుకు విరక్తి చెందింది.
తల్లిదండ్రులు కుమారుడికి ఏ విధమైన రుణాలు ఇవ్వకపోవడంతో అ ప్పులు చేయగా అప్పుల వారంతా తల్లిదండ్రులపై పడ్డారు. ఉన్న ఎకరం పొలం అమ్మి కొ డుకు చేసిన అప్పులు తీర్చింది. వెంకట్రామన్నగూడెంలో సహజీవనం చేసిన మహిళ బంధువులు రూ.2లక్షలు కావాలంటూ కుమారుడు ఇంటిపై దౌర్జన్యం చేసి తల్లిని చంపుతానని భయపెట్టారు. దీంతో రోడ్డు పక్కన ఉన్న కిళ్లీ షాపు అమ్మి పెద్దిరాజుకు కావాల్సిన నగదు ఇచ్చింది.
నాలుగు నెలల అనంతరం ఉన్న ఇల్లు అమ్మి తనకు డబ్బులు ఇవ్వాలని పెద్దిరాజు పట్టుబట్టాడు. ఆమె అందుకు నిరాకరించింది. దీంతో ఆగ్రహంగా ఉ న్న పెద్దిరాజు బుధవారం రాత్రి ప్రకాశరావుపాలెంలోని తల్లిదండ్రుల ఇంటి వద్దకు రాగా భయాందోళతో వారు వేరే చోట తలదాచుకున్నారు. తమను ఎలాగైనా చంపేస్తాడని భావించిన తల్లి పద్మావతి కుమారుడిని కడతేర్చేందుకు సిద్ధపడింది.
అదే రాత్రి లీటర్ పెట్రోల్ కొని ఇంటి ముందు పెరట్లో దాచి ఉంచింది. ఉదయం 9గంటలకు ఇంటి బయట మంచంపై కుర్చున్న కుమారుడు పెద్దిరాజుపై పెట్రోల్ వేసి వెంటనే అగ్గిపుల్లతో అంటించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో పెద్దిరాజు కాలి బూడిదయ్యాడు.












Click it and Unblock the Notifications