వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగ్గారెడ్డిపై దామోదర భార్య నిప్పులు, సంగారెడ్డినుండి సై

By Srinivas
|
Google Oneindia TeluguNews

Padmini lashes out at Jagga Reddy
మెదక్/హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. సంగారెడ్డి శాసన సభ్యులు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గా రెడ్డి) పైన ఆమె నిప్పులు చెరిగారు. ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

వచ్చే ఎన్నిక్లలో జగ్గా రెడ్డి పైన సంగారెడ్డి నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎన్నికలలో పోలింగ్ బూత్‌లను ఆక్రమిస్తానన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలు అప్రజాస్వామికమని ఆమె మండిపడ్డారు. జగ్గా రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని తాను రాష్ట్రపతి, గవర్నర్, ఎన్నికల సంఘంలతో పాటు వివిధ పార్టీల నేతలకు లేఖలు రాశానని పద్మిని తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో పోలింగ్ బూత్‌లను కబ్జా చేసి అయినా లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని జగ్గారెడ్డి చెప్పారని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. మరోవైపు.. జగ్గా రెడ్డి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని తాను రాష్ట్రపతి, కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి లేఖ రాసినట్లు దామోదర రాజనర్సింహ చెప్పారు.

కాగా, తెలంగాణలో కాంగ్రెసు పార్టీకి, సోనియా గాంధీకి అండగా ఉంటామని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు హైదరాబాదులో అన్నారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు ఢిల్లీ నుంచి వచ్చిన సందర్భంగా కాంగ్రెసు కార్యకర్తలు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్నారు. డప్పు వాయిద్యాలతో వారికి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.

ఎంపీలు మధుయాష్కీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాజయ్య, రాపోలు ఆనంద భాస్కర్, పొన్నం ప్రభాకర్, మంత్రి జానారెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు వచ్చారు. కాగా, కాగా, విమానాశ్రయం వెలుపలికి వచ్చిన వెంటనే నేతలు మట్టిని ముద్దాడారు. అనంతరం వారు గన్‌పార్క్‌లో అమరవీరుల స్థాపానికి నివాళులు అర్పించేందుకు బయలుదేరారు.

English summary
Deputy Chief Minister Damodara Rajanarasimha's wife Padmini is ready to contest from Sanga Reddy in next general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X