వెంకయ్య ఏమయ్యారు?: ఎపికి ప్రత్యేక హోదాపై పల్లంరాజు ప్రశ్న
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాజకీయం చేసే అంశం కాదని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెసు నాయకుడు పల్లంరాజు అన్నారు. మంగళవారంనాడు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ప్రత్యేక హోదా కోసం ఆ పార్టీ నిర్వహించిన బంద్‌లో ఆయన పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలని పట్టుబట్టిన కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఏమయ్యారని ఆయన ప్రశ్నించారు. అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ఎపికి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఏమయ్యారని ఆయన అడిగారు.

గత యుపిఎ ప్రభుత్వం విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన సమయంలో ఎప్పికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిందని, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ హామీ ఇచ్చారని, అయితే ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి నాయకుడు వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారని ఆయన గుర్తు చేశారు.
ఎన్నికల సమయంలో సీమాంధ్రలో పర్యటించిన మోడీ ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదనే సంకేతాలను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం బంద్ జరుగుతోంది.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications