పతివాడకు పల్లె కౌంటర్, లోకేష్‌కు పార్టీలో కీలక పదవి ఇవ్వాలి

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన అసహనం వ్యక్తం చేసిన సీనియర్ నేత పతివాడ నారాయణ స్వామికి మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆదివారం నాడు కౌంటర్ ఇచ్చారు. పదవి రాలేదని ఇష్టారీతిగా మాట్లాడితే విలువలు పోతాయన్నారు.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా లోకేష్!

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్‌ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆహ్వానించాలని మినీ మహానాడులో తీర్మానం చేస్తున్నారు. విశాఖలో మినీ మహానాడు నిర్వహించారు.

Palle counter to Pativada, Nara Lokesh into direct politics

ఇందులో పార్టీ నేత రెహ్మాన్ ఓ తీర్మానం ప్రవేశ పెట్టారు. లోకేష్‌ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆహ్వానించి, కీలక పదవి ఇవ్వాలని తీర్మానం పెట్టారు. ఈ తీర్మానానికి నాయకులు, కార్యకర్తలు అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

కాగా, రానున్న మహానాడు వేదికలో నారా లోకేష్‌కు పార్టీలో ఏదైనా కీలక పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రధాన కార్యదర్శి లేదా మరో పదవి లోకేష్‌కు ఇస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+