వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచివాలయంలో పల్లె రఘునాథ్ రెడ్డికి గాయాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి సచివాలయంలో గాయాలయ్యాయి. ఆయన సచివాలయంలో తన చాంబరులోని అన్ని గదులను బుధవారం తిరిగి పరిశీలించారు. అనంతరం తన వ్యక్తిగత గదిలోకి వెళ్లారు. ఈ సమయంలో ఆయనకు ఓ బల్ల ఆయన కాలికి తగిలింది. దీంతో అతనికి గాయమైంది.

బల్లకు గ్లాస్ ఉండటంతో ఆ గాయం నుండి రక్తం బాగా కారింది. అంతేకాకుండా, అంతకుముందు అదే స్థానంలో గాయం ఉండటంతో ఇది ఎక్కువ అయింది. అయితే, ఇది చిన్న గాయమే. అతనికి గాయం కాగానే భద్రతా సిబ్బంది నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా, సాయంత్రం ఆయనను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు ఆయనను ఫోన్లో పరామర్శించారు.

 Palle Raghunath Reddy injured

రుణమాఫీపై రాద్ధాంతం వద్దు: మంత్రి మృణాళిని

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేసిన ప్రభుత్వాన్ని అభినందించాల్సిందిపోయి అనవసర రాద్ధాంతం చేయడం విపక్షాలకు తగదని గృహనిర్మాణ శాఖ మంత్రి మృణాళిని అన్నారు. మంగళవారం ఆమె విజయనగరంలో మాట్లాడారు.

తుఫాన్‌ బాధితుల కోసం ఉత్తరాంధ్రతోపాటు తూర్పుగోదావరి జిల్లాలో ప్రకృతి విపత్తులను తట్టుకునేలా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఈ నాలుగు జిల్లాల్లో లక్షా 24 వేల ఇళ్లను నిర్మించనున్నట్టు తెలిపారు.

విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని మంత్రి చెప్పారు. తీర ప్రాంతంలో నిర్మించే ఈ ఎయిర్‌పోర్టు దేశంలోనే మొదటిదవుతుందన్నారు. దీనికి సంబంధించి నిపుణులు, అ ధికారుల బృందం 10 రోజుల్లో ఇక్కడ స్థలాన్ని పరిశీస్తుందని, ఇతర అంశాలను మరోసారి విచారించి కేంద్రానికి నివేదిక అందిస్తుందని మృణాళిని తెలిపారు.

English summary
Andhra Pradesh Minister Palle Raghunath Reddy injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X