వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిట్లర్, ముస్సోలిని..: కెసిఆర్‌పై పల్లె రఘునాథ్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

తిరుపతి: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు విద్యార్థుల భవిష్యత్‌ను ఇబ్బందుల్లో పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి రఘునాథ రెడ్డి ఆరోపించారు.
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మంత్రి పల్లె రఘునాథ రెడ్డి మీడియాతో మాట్లాడారు. స్థానికతకు 1956ని ఎలా ప్రామాణికంగా ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. అమెరికాలో ఐదేళ్లుంటే గ్రీన్ కార్డు వస్తుందని చెప్పారు.

కెసిఆర్.. హిట్లర్, ముస్సోనిలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. విభజన జరిగిన తరువాత రాష్ట్రానికి ఉన్న కష్టాలు మరే రాష్ట్రానికి లేవని, అయినా అవినీతి రహిత, పారదర్శక పాలనతో అన్నింటినీ అధిగమిస్తామన్నారు. కొత్త ఐటి విధానం రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతుందని ధీమా వ్యక్తం చేశారు. రూ. 42వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 5లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

పల్లె రఘునాథ రెడ్డి

పల్లె రఘునాథ రెడ్డి

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని బుధవారం ఉదయం మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

పల్లె రఘునాథ రెడ్డి

పల్లె రఘునాథ రెడ్డి

మంత్రి పల్లె రఘునాథ రెడ్డికి ఆలయ అధికారులు, పురోహితులు ఘన స్వాగతం పలికారు.

పల్లె రఘునాథ రెడ్డి

పల్లె రఘునాథ రెడ్డి

అనంతరం ఆయన వెంకటేశ్వరస్వాములవారికి, కుల మాత, ఆనంద నిలయం విమాన వెంకటేశ్వర, భాష్యకర్ల సన్నిధి, యోగ నర్సింహస్వామివార్లను దర్శించుకున్నారు.

పల్లె రఘునాథ రెడ్డి

పల్లె రఘునాథ రెడ్డి

అనంతరం ఆయన వెంకటేశ్వరస్వాములవారికి, కుల మాత, ఆనంద నిలయం విమాన వెంకటేశ్వర, భాష్యకర్ల సన్నిధి, యోగ నర్సింహస్వామివార్లను దర్శించుకున్నారు.

పల్లె రఘునాథ రెడ్డి

పల్లె రఘునాథ రెడ్డి

ప్రత్యేక పూజల అనంతరం రంగనాయకులు మండపంలో వేద పండితులు మంత్రికి వేదాశీర్వాదం అందించారు.

అంతకుముందు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని బుధవారం ఉదయం మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అధికారులు, పురోహితులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఛైర్మన్ అలోక్ సిన్హా, సినీ గాయని సునీత, ఆంధ్రా క్రికెట్ సంఘం మాజీ కార్యదర్శి చాముండేశ్వరినాథ్, తదితరులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.

అనంతరం ఆయన వెంకటేశ్వరస్వాములవారికి, కుల మాత, ఆనంద నిలయం విమాన వెంకటేశ్వర, భాష్యకర్ల సన్నిధి, యోగ నర్సింహస్వామివార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం రంగనాయకులు మండపంలో వేద పండితులు మంత్రికి వేదాశీర్వాదం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ చిన్నమగారి రమణ, రిసెప్షన్ డిప్యూటీ ఈఓ వెంకటయ్య, ఓఎస్‌డి దామోదర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

English summary
Information and Public relations, information technology communication Minister of Andhra Pradesh offers prayers in Tirumala shrine on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X