ఆ నియామాకాల వెనుక: 12 మందికి పదవులు, చక్రం తిప్పిన గాలి, బాబు గ్రీన్ సిగ్నల్

శాసనసభలో, శాసనమండలిలో చీప్ విప్‌లు, విప్‌ల నియామకం విషయంలో అడిగిన వారికీ పదవులు కట్టబెట్టారు. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు సూచన మేరకే చంద్రబాబునాయుడు చీఫ్‌విప్‌, విప్‌ల నియామకం విషయంలో నిర్ణయం

అమరావతి: శాసనసభలో, శాసనమండలిలో చీప్ విప్‌లు, విప్‌ల నియామకం విషయంలో అడిగిన వారికీ పదవులు కట్టబెట్టారు. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు సూచన మేరకే చంద్రబాబునాయుడు చీఫ్‌విప్‌, విప్‌ల నియామకం విషయంలో నిర్ణయం తీసుకొన్నారని టిడిపిలో చర్చ సాగుతోంది.

చీప్‌విప్‌లు, విప్‌ల నియామకంపై తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ ప్రజా ప్రతినిదులకు పదవులను కట్టబెడుతూ చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఈ వారం రోజుల్లో నిర్ణయం తీసుకొంది. అయితే మండలి ఛైర్మెన్ ఫరూక్‌ కు పదవిని కట్టబెట్టింది.

ఆ తర్వాత అసెంబ్లీ, మండలి విప్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. మంత్రి పదవులు దక్కని వారికి విప్ ,చీప్‌విప్‌ పదవులను కట్టబెట్టారు చంద్రబాబునాయుడు.

గాలి ముద్దుకృష్ణమనాయుడు సూచనతో చంద్రబాబు

గాలి ముద్దుకృష్ణమనాయుడు సూచనతో చంద్రబాబు

.విప్‌ పదవుల నియామకంపై ఎలాంటి నియంత్రణ లేదని శాసనసభ-శాసనమండలి నియమావళిలో కూడా విప్‌ పదవులు నిర్ణీత సంఖ్యలో ఉండాలనే నిబంధన ఏదీ లేదని చంద్రబాబుకు మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు సూచించారు. ఈ సూచనతో గాలి ముద్దుకృష్ణమనాయుడు అసెంబ్లీ, మండలిలో చీప్‌విప్‌ పదవులను కేటాయించారు. పల్లె రఘునాథ్‌రెడ్డికి చీప్ విప్, గణబాబు, సర్వేశ్వరావులకు విప్ పదవులు కేటాయించారు. అంతేకాదు మండలిలో పయ్యావుల కేశవ్‌కు చీప్ విప్, డొక్కా మాణిక్య వరప్రసాద్, రామసుబ్బారెడ్డి, షరీఫ్, బుద్దా వెంకన్నకు విప్ పదవులు దక్కాయి.

అన్ని వర్గాలకు ప్రాధాన్యత కోసమే

అన్ని వర్గాలకు ప్రాధాన్యత కోసమే

సాధారణ ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉందనగానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదవుల పందేరానికి తెరతీశారు. ప్రాంతాలను, సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకుని పదవుల పందేరాన్ని ప్రారంభించారు. శాసనసభ, శాసనమండలిలలో విప్‌ పదవులతో పన్నెండు మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సంతృప్తి పరిచారు.ఈ మేరకు చంద్రబాబునాయుడు పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు సూచన మేరకు విప్, చీఫ్ పదవులను కట్టబెట్టారు.

బుద్దా వెంకన్న, డొక్కాకు పదవులు

బుద్దా వెంకన్న, డొక్కాకు పదవులు

శాసనమండలిలో విప్‌ల నియామయంతో టిడిపి ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, డొక్కా మాణిక్యవరప్రసాద్‌లకు అదృష్టం వరించింది. పార్టీకి, తనకు విధేయుడిగా ఉన్నారని బుద్దా వెంకన్నకు చంద్రబాబు పదవి లభించిందంటున్నారు.మీడియాలోప్రభుత్వ వైఖరిని గట్టిగా వినిపిస్తున్నందుకు మాణిక్యవరప్రసాద్‌కు పదవి లభించిందని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

12 మందికి పదవులు

12 మందికి పదవులు

ఇప్పటికే అసెంబ్లీలో చింతమనేని ప్రభాకర్‌, కూన రవికుమార్‌, మేడా మల్లిఖార్జున రెడ్డి, యామినీ బాల విప్‌లుగా ఉండగా అదనంగా గణబాబు, సర్వేశ్వరరావులను విప్‌లుగా నియమించారు. దీంతో విప్‌ల సంఖ్య ఆరుకు చేరింది. మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డికి చీప్‌విప్ పదవిని కట్టబెట్టారు.మంత్రివర్గ విస్తరణంలో పల్లె రఘునాథ్‌రెడ్డి మంత్రి పదవిని కోల్పోయారు.శాసనమండలిలో చీఫ్‌ విప్‌గా అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ను నియమించారు. అక్కడ విప్‌లు కూడా లేకపోవడంతో ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, రామసుబ్బారెడ్డి, షరీఫ్, డొక్కా మాణిక్యవరప్రసాద్‌లను నియమించారు. ఇందులో బుద్దా వెంకన్న, మాణిక్య వరప్రసాద్‌లు అదృష్టవంతులు. ఇలా రెండు సభలలో చీఫ్‌ విప్‌లతో కలుపుకుని పన్నెండు మందికి పదవులు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+