పవన్ తో వైసీపీ మాజీ నేత సమావేశం - సీటు పై హామీ..!!
వైసీపీ మాజీ నేత జనసేనలో చేరటం ఖాయమైంది. వైసీపీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జనసేనాని పవన్ తో సమావేశమయ్యారు. రెండు రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన పంచకర్ల జనసేనలో చేరుతారనే ప్రచారం సాగింది. పవన్ తో భేటీ తరువాత తన చేరిక పైన రమేష్ బాబు స్పష్టత ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో రమేష్ బాబుకు సీటు పైన పవన్ నుంచి హమీ దక్కినట్లు తెలుస్తోంది.
విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేసారు. భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై తన అనుచర వర్గంతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో పెందుర్తి నుంచి పోటీ చేయాలని పంచకర్ల కోరుకుంటున్నారు. వైసీపీలో సీటు గురించి హామీ దక్కలేదు. అక్కడ ప్రస్తుతం వైసీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. పంచకర్ల రాజీనామా నిర్ణయం ముందు తనతో చర్చించి ఉంటే బాగుండేదని వైసీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే, సీఎం ను కలిసేందుకు తనకు అవకాశం దక్కలేదని రమేష్ బాబు చెబుతున్నారు. జనసేన పార్టీ కోసం ఓ సైనికుడిలా పనిచేస్తానని రమేష్ బాబు స్పష్టం చేసారు.

ఈ నెల 20న తన అనుచర వర్గంతో కలిసి పంచకర్ల అధికారికంగా జనసేనలో చేరనున్నారు. జనసేన పార్టీ భావజాలం, రాష్ట్ర శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ పడుతున్న తపన చూసి నేను కూడా ఒక సైనికుడిలా ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. అదే విషయం పవన్ తో చెప్పినట్లు పేర్కొన్నారు. పార్టీ ఉన్నతి కోసం కృషి చేస్తానని పంచకర్ల పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తానని రమేష్ బాబు వివరించారు. టీడీపీ జనసేన పొత్తు ఖాయమని భావిస్తున్న సమయంలో విశాఖలో కీలకమైన పెందుర్తి నుంచి జనసేన నుంచి రమేష్ బాబుకు హామీ లభించిందనే చర్చ ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications