• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నిమ్మగడ్డ ఎక్కడ? భయంతో రాత్రికి రాత్రే ప్రైవేటు వాహనంలో -సుప్రీం తీర్పును బట్టి మెరుపు సమ్మె

|

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జగన్ ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. వైసీపీ ప్రత్వం ఎన్నికలకు నో చెబుతుండగా, ఉద్యోగ సంఘాలు మరో అడుగ ముందుకేసి, ఎస్ఈసీ తీరును తప్పుపట్టారు. దీంతో నిమ్మగడ్డ మరోసారి సెక్యూరిటీ అంశాన్ని లేవనెత్తారు. ఫలానా వ్యక్తులతో తనకు ప్రాణహాని ఉందన్న ఆయన.. రాత్రికిరాత్రే రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోయారు. దీనిపై అధికార పార్టీ నేతలు, ఉద్యోగ సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు..

RBI సంచలనం: మళ్లీ నోట్లరద్దు -పాత రూ.100 ఇక చెల్లదు -రూ.10, రూ.5నోట్లు కూడా -నాణేలపైనా

ఆ వ్యక్తితో ప్రాణహాని ఉందంటూ..

ఆ వ్యక్తితో ప్రాణహాని ఉందంటూ..

కరోనా వేళ ఎన్నికల విధుల్లో తాము పాల్గొనబోమని, వ్యాక్సినేషన్ తర్వాతే పోలింగ్ పెట్టాలని ఏపీ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. ఈక్రమంలో అభ్యంతరాలను పట్టించుకోకుండా ఎస్ఈసీ నిమ్మగడ్డ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయడంపై ఉద్యోగ సంఘాల ప్రతినిధి వెంకట్రామిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వాటిపై నిమ్మగడ్డ సైతం స్పందించారు. ‘‘వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు ఉద్యోగుల్ని రెచ్చగొట్టేలా ఉన్నాయి. అతను నాపై భౌతికదాడికి కూడా పాల్పడే అవకాశాలున్నాయి. అతని చర్యలతో నాకు ప్రాణహాని ఉంది. వెంటనే వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి''అని డీజీపీ గౌతమ్ సవాంగ్ కు నిమ్మగడ్డ లేఖరాశారు. ప్రాణభయం ఉందంటూ ఎస్ఈసీ చేసిన వ్యాఖ్యలపై షాకయ్యానని వెంకట్రామిరెడ్డి చెప్పారు. ఈలోపే..

రాత్రికి రాత్రే ప్రైవేటు వాహనంలో..

రాత్రికి రాత్రే ప్రైవేటు వాహనంలో..

ఏపీ ఉద్యోగ సంఘాల నేతలతో ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. రాత్రికి రాత్రే రాష్ట్రాన్ని వీడటం గమనార్హం. నిమ్మగడ్డ విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కార్యాలయం నుంచి ఆయన రహస్యంగా బయల్దేరారని, ఎన్నికల కమిషన్ కు చెందిన అధికారిక వాహనంలో కాకుండా ప్రైవేటు వాహనంలో ఆయన పయనమయ్యారని తెలుస్తోంది. నిజానికి..

Shrishti Goswami అనే నేను సీఎంగా -ఒక్కరోజు ముఖ్యమంత్రిగా రికార్డు -అసెంబ్లీ సమావేశాలు కూడా

ఉద్యోగుల విముఖత.. గవర్నర్ నో చెప్పడంతో?

ఉద్యోగుల విముఖత.. గవర్నర్ నో చెప్పడంతో?

పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ ప్రకటించిన నిమ్మగడ్డ.. ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేలా చర్చిద్దామంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని సమావేశం కోసం పిలిచారు. కానీ వారు ఎస్ఈసీ పిలుపును ఖాతరు చేయలేదు. సీఎస్, డీజీపీ స్థాయి నుంచి క్లర్లుల వరకు ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎన్నికలపై విముఖత ప్రదర్శిస్తూ, ఎస్ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని నిమ్మగడ్డ భావించారు. కానీ, రాజ్ భవన్ అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో విజయవాడలో ఉండలేక, రాత్రికిరాత్రే నిమ్మగడ్డ హైదరాబాద్ వెళ్లిపోయినట్లు సమాచారం. దీనిపై..

పంచాయితీ పెట్టి పారిపోయారంటూ..

పంచాయితీ పెట్టి పారిపోయారంటూ..

ఎన్నికల వేళ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ రాష్ట్రాన్ని వీడటంపై అధికార వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ వద్దంటున్నా ఏకపక్షంగా పంచాయితీ ఎన్నికలు పెట్టి పారిపోయారంటూ నిమ్మగడ్డపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గతేడాది స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన సందర్భంలోనూ నిమ్మగడ్డ ఇదే తీరుగా వ్యవహరించారని, ఏపీ ప్రభుత్వం వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ కేంద్రానికి లేఖరాసి హైదరాబాద్ జంప్ అయ్యారని, ఇప్పుడు కూడా ప్రాణహాని కార్డును వాడి, పక్కా రాష్ట్రానికి వెళ్లిపోయారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే..

సుప్రీం తీర్పును బట్టి మెరుపు సమ్మె

సుప్రీం తీర్పును బట్టి మెరుపు సమ్మె

పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తొలుత హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, అందులో లోపాలున్నాయంటూ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ దాన్ని తిరస్కరించారు. దీంతో ఏపీ ప్రభుత్వం, ఏపీ ఉద్యోగ సంఘాలు విడివిడిగా స్పెషల్ లీవ్ పిటిషన్లను దాఖలు చేశారు. వీటిని సోమవారం విచారిస్తామని కోర్టు తెలిపింది.

ఈ పిటిషన్లను తెలగువారైన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరావు నేతృత్వంలోని బెంచ్ విచారించనుంది. ఇందులో జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఇందూ మల్హోత్రా సభ్యులుగా ఉన్నారు. సోమవారం సుప్రీంకోర్టు వెలువరించే తీర్పును బట్టి కార్యాచరణ ఉంటుందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఒకవేళ సుప్రీం కూడా ఎన్నికలకు వెళ్లాలని చెబితే.. ఉద్యోగులు మూకుమ్మడిగా మెరుపు సమ్మెకు దిగొచ్చని తెలుస్తోంది.

English summary
Andhra Pradesh State Election Commissioner Nimmagadda Ramesh Kumar leavs the state after announcement of notification for panchayt elections. it is reported that nimmagadda left Amaravati and gone to Hyderabad in a private vehicle. denying elections process, ap govt officials did not attend meetings called by sec nimmagadda
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X