వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్ రిజర్వ్‌డ్ పంచాయతీలు: కానీ బరిలో ఎస్సీ అభ్యర్థులు.. ఎలానంటే..

|
Google Oneindia TeluguNews

ఏపీలో పంచాయతీ ఎన్నిల్లో చిత్ర, విచిత్రాలు వెలుగుచూస్తున్నాయి. పంచాయతీ/ ఇతర ఎన్నికల్లో రిజర్వేషన్ తప్పనిసరి. ఆయా రిజర్వేషన్ల మేరకు సభ్యులు బరిలోకి నిలుస్తారు. సాధారణంగా చాలా పోటీ ఉంటుంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఎస్సీ/ ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా కాంపిటీషన్ ఉంది. కానీ ప్రకాశం జిల్లాలో కాస్త విచిత్ర సిచుయేషన్ ఏర్పడింది.

ప్రకాశం జిల్లా అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. రెండు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ పదవి అన్‌రిజర్వ్‌డ్‌కు కేటాయించారు. కానీ.. ఆ గ్రామాల్లో ఓటర్లంతా ఎస్సీ సామాజికవర్గం వారే ఉన్నారు. దీంతో ఎస్సీలే బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అద్దంకి మండలం విప్పర్లవారిపాలెంలో మొత్తం 489 మంది ఓటర్లున్నారు. సర్పంచ్‌ పదవీ అన్‌రిజర్వ్‌డ్‌ మహిళకు కేటాయించారు. ఓటర్లందరూ ఎస్సీలే కావడంతో ఆ సామాజికవర్గానికి చెందిన మహిళలే బరిలో నిలుస్తున్నారు.

panchayat is unreserved but all candidates are scs

ఇక పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరు మండలం లక్కవరం గ్రామంలోని 647 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా కూడా ఎస్సీలే కావడం విశేషం. ఇక్కడా సర్పంచ్‌ పదవీని అన్‌రిజర్వ్‌డ్‌కు కేటాయించారు. కానీ ఎస్సీలే పోటీ చేస్తున్నారు. ఈ నెల 9న జరిగే ఎన్నికల్లో సర్పంచ్‌, వార్డు సభ్యులుగా ఎన్నిక జరగనుంది. అయితే ఆ రెండు గ్రామాల జనాభా గురించి ఎన్నికల కమిషన్ అంచనా వేయలేదా అనే అనుమానం కలుగుతోంది. ఎస్సీలే ఉంటే అన్ రిజర్వ్‌డ్ ఎలా కేటాయిస్తారు అని ప్రశ్నిస్తున్నారు.

English summary
panchayat is unreserved but all candidates are scs in prakasam district parchur, addanki mandal villages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X