ఖద్దరు చొక్కాలు వేసుకున్న వైసీపీ నాయకులే ఎర్రచందనం స్మగ్లర్లు : పంచుమర్తి అనూరాధ తీవ్ర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీపై ప్రతిపక్ష పార్టీల నేతలు మూకుమ్మడి దాడికి దిగారు. రాష్ట్రంలో రోడ్ల అధ్వానంగా ఉన్నాయని, రోడ్ల కాంట్రాక్టర్లను వైసీపీ నేతలు తీవ్ర బెదిరింపులకు గురి చేస్తున్నారని విమర్శిస్తున్నారు. తాజాగా రాయదుర్గంలో రోడ్ కాంట్రాక్టర్ ను వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరుడు బెదిరించారన్న వార్తల నేపధ్యంలో మరింత మాటలదాడి పెంచారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధులకు వికలాంగులకు ఇచ్చే పెన్షన్ల విషయంలో వైసీపీ తీరును ఎండగడుతూ ఉన్నారు. పెన్షన్ల పథకంలో నిరుపేదలైన లబ్ధిదారులను తొలగిస్తున్నారని సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. మరోవైపు వినాయకచవితి రానున్న నేపథ్యంలో రాష్ట్రంలో వినాయక చవితి నవరాత్రులు జరపాలని అధికార పార్టీ పై ఒత్తిడి తెస్తున్నారు.

సన్న బియ్యం తరలించే వాహనాలలో ఎర్రచందనం తరలిస్తూ వైసీపీ నాయకుడు పట్టుబడ్డాడు
ఇదే సమయంలో వైసీపీ నేతల అరాచకాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టిడిపి నేతలు. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఏపీలో వైసీపీ నేతల అరాచకాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఖద్దరు బట్టలు వేసుకున్న వైసీపీ నేతలే ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారంటూ పంచుమర్తి అనూరాధ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సన్న బియ్యం తరలించే వాహనాలలో ఎర్రచందనం కూడా తరలిస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుడిభుజం అయిన అశోక్ రెడ్డి పట్టుబడ్డారు అని పంచుమర్తి అనురాధ విమర్శించారు.

చంద్రబాబు హయాంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపారు
రాష్ట్రంలో వైసీపీ నేతలు చెయ్యని అరాచకాలు లేవని ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగడుగునా దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. ఒక ఛాన్స్ ఇస్తే ఏపీ లోని సహజ సంపదను దోచేస్తా దాచేస్తా.. దోపిడీదారులను రక్షిస్తా.. పెద్ద మనుషులు గా నిలబెడతా అన్న చందంగా వైసిపి ప్రభుత్వం ఉందని పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపారని పేర్కొన్నారు పంచుమర్తి అనురాధ.

ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తుంది వైసీపీ నాయకులే
నాడు చంద్రబాబు రెడ్ శాండిల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి ఐజీ స్థాయి అధికారిని నియమించి రెండు వేల నూట యాభై మంది స్మగ్లర్లను అరెస్టు చేయించి, స్మగ్లింగ్ అరికట్టారని పంచుమర్తి అనురాధ గుర్తుచేశారు. ఇప్పుడు ఆ వైసీపీ నేతలు వేల ఎకరాలను కొల్లగొడుతున్నారని, లిక్కర్ మాఫియాను , శాండ్ మాఫియాను నడుపుతున్నారని ఇక ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ కూడా కొనసాగిస్తున్నారని పంచుమర్తి అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఒక్కొక్క వైసీపీ నేత ఒక అంతర్రాష్ట్ర స్మగ్లర్ లా అంటూ ధ్వజం
రెండేళ్లుగా వైసీపీ ప్రభుత్వం 200 మందిని కూడా అరెస్టు చేయలేదని ఒక్కొక్క వైసీపీ నేత ఒక అంతర్రాష్ట్ర స్మగ్లర్ లాగా, కొల్లం గంగిరెడ్డిలాగా తయారవుతున్నారని పంచుమర్తి అనురాధ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల కాలంలో చిత్తూరు జిల్లా కేంద్రంగా ఎర్రచందనం స్మగ్లింగ్ విపరీతంగా జరుగుతుందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ స్మగ్లింగ్ ముఠాలకు వైసిపి నేతల మద్దతు పూర్తిగా ఉంటుందని, వైసీపీ నేతలు సహకారంతోనే శాండల్ వుడ్ స్మగ్లింగ్ మాఫియా రెచ్చిపోతుంది అని టిడిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలోనే పంచుమర్తి అనురాధ ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియాను నడిపిస్తుంది ఖద్దరు చొక్కాలు వేసుకున్న వైసీపీ నేతలే అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications