వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ షర్మిల ప్రశ్నకు జవాబు చెప్పే దమ్ముందా .. జగన్ ను ఇరకాటంలో పెట్టి పంచుమర్తి సూటి ప్రశ్నలు

|
Google Oneindia TeluguNews

టిడిపి మహిళా నాయకురాలు పంచుమర్తి అనురాధ వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ ని ఇరకాటంలో పెట్టారు. మీ సోదరి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా జగన్ రెడ్డి అంటూ పంచుమర్తి అనురాధ సవాల్ విసిరారు. ఇదే సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపైన కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

రెండు నిమిషాలు కూర్చొని నీటి పంచాయతీలు మాట్లాడుకోలేరా? షర్మిల వ్యాఖ్యలతో జగన్ కు కౌంటర్

రెండు నిమిషాలు కూర్చొని నీటి పంచాయతీలు మాట్లాడుకోలేరా? షర్మిల వ్యాఖ్యలతో జగన్ కు కౌంటర్

వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా వైయస్ షర్మిల చేసిన ప్రసంగంలో ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై షర్మిల ప్రస్తావించారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించవచ్చు.. కౌగిలించుకోవచ్చు .. భోజనాలు పెట్టొచ్చు.. సీట్లు కూడా తినిపించవచ్చు కానీ రెండు నిమిషాలు కూర్చొని నీటి పంచాయతీలు మాట్లాడుకోలేరా అంటూ సొంత చెల్లి షర్మిల సీఎం జగన్ మోహన్ రెడ్డి ని ప్రశ్నించిందని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ జగన్ ను పాయింట్ అవుట్ చేశారు.

సోదరి అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పే దమ్ముందా ?

సోదరి అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పే దమ్ముందా ?


జలవివాదంపై షర్మిల అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం జగన్ రెడ్డికి, ఆయన పార్టీ నేతలకు ఉంటే సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు పంచుమర్తి అనురాధ. సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు తమ స్వప్రయోజనాల కోసం ఏపీ ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టారని అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ చేసిన మోసాలకు ఒక చెల్లెలు ఢిల్లీలో పోరాడుతుంటే మరో చెల్లి హైదరాబాద్లో పోరాడుతోందని పంచుమర్తి అనురాధ షాకింగ్ పంచ్ ఇచ్చారు .

వైఎస్ హయాంలో రైతులు ప్రాణాలు కోల్పోలేదా ?

వైఎస్ హయాంలో రైతులు ప్రాణాలు కోల్పోలేదా ?

కెసిఆర్ తో చాలామంది వైసీపీ నేతలకు సంబంధాలున్నాయని ఆరోపించిన అనురాధ అందుకే సీఎం కేసీఆర్ పై వైసీపీ నేతలు నోరెత్తి మాట్లాడలేక పోతున్నారు అంటూ పేర్కొన్నారు. వైఎస్సార్ ను గొప్ప రైతు నేస్తంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎరువుల కోసం క్యూలో నిలబడ్డ రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె సోంపేట , కాకరాపల్లి, ముదిగొండ లో పన్నెండు మంది రైతులను నాడు బలిగొన్నారని గుర్తు చేశారు.

వైఎస్సార్ ఏ రైతులను ఉద్ధరించారో ?

వైఎస్సార్ ఏ రైతులను ఉద్ధరించారో ?


వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో గిట్టుబాటు ధర లేక 14 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం సాగించారని నిప్పులు చెరిగారు అనురాధ. వ్యవసాయరంగానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏం చేశారని, ఆయన ఏ రైతులను ఉద్ధరించారని ఆయన పేరుతో ఆయన జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించి ఉత్సవాలు జరుపుతున్నారని నిలదీశారు. ఈ సమయంలో మీరు జరుపుకోవాల్సినది రైతు దినోత్సవాలు కాదు.. రైతు సంకెళ్ల దినోత్సవాలు, రైతులను కాల్చిచంపిన దినోత్సవాలు , రైతు కన్నీటి దినోత్సవాలు అంటూ పంచుమర్తి అనురాధ అసహనం వ్యక్తం చేశారు.

Recommended Video

YSRCP Dharna On Nannapaneni Rajakumari Comments || నన్నపనేని రాజకుమారి పై మండిపడుతున్న దళిత సంఘాలు
వైఎస్ వల్ల ఆంధ్రాకి అన్యాయం

వైఎస్ వల్ల ఆంధ్రాకి అన్యాయం

నాడు వైఎస్ జగన్ ఇద్దరూ రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు. నాడు వైఎస్ ఆంధ్రాకి అన్యాయం చేశాడని విమర్శించారు. ఇడుపులపాయలో దళితుల భూములను కాజేసిన మీరా రైతులను ఉద్ధరించేది అంటూ ప్రశ్నించారు. జగన్, వైయస్ ఇద్దరూ స్వప్రయోజనాల కోసం కేంద్రం ముందు సాగిలపడ్డారని విమర్శించారు. షర్మిల వ్యాఖ్యలను ఆయుధంగా చేసుకొని జగన్ పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు టిడిపి నేత పంచుమర్తి అనురాధ.

English summary
Panchumarthi Anuradha challenged Jagan Reddy and his party leaders to have the courage to answer Sharmila's question on the water dispute. Anuradha made harsh remarks that CM Jagan Mohan Reddy and YCP leaders were holding AP interests hostage in Delhi for their own self-interest. Panchumarthi Anuradha gave a shocking punch that one sister was fighting in Delhi while another sister was fighting in Hyderabad because of Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X