అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చెయ్..ఎస్ఈసిని పశువుతో పోలుస్తావా ? మంత్రి పెద్దిరెడ్డిపై పంచుమర్తి అనురాధ ఫైర్
పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ ఫైర్ అయ్యారు. తులసి వనం లాంటి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కలుపు మొక్క వంటి వాడిని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన అనురాధ చిత్తూరు జిల్లాలో మహిళలను కూడా దుర్భాషలాడే మంత్రి పెద్దిరెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు.

ఎస్ఈసిని పశువుతో పోలుస్తారా .. అనురాధ ఫైర్
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను వాడు వీడు అని సంబోధించడం, దొడ్లో కట్టేసిన ఎద్దు అంటూ ఒక పశువుతో పోల్చడం పై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాను గంజాయి వరంగా మార్చారని పంచుమర్తి అనురాధ మండిపడ్డారు .పంచాయతీ ఎన్నికలను ఎదుర్కొనే సత్తా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి లేదని పేర్కొన్న అనురాధ, ఎన్నికల్లో గెలవలేక దొంగ దారులు వెతుక్కుంటున్నారు అంటూ మండిపడ్డారు.

మంత్రిగా పెద్దిరెడ్డి ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చెయ్యాలని సవాల్
పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ చేశారు. చిత్తూరు జిల్లాలో మహిళలు నామినేషన్లు వేయడానికి భయపడుతున్నారని, నామినేషన్ పత్రాలను సీక్రెట్ గా దాచుకుని, నామినేషన్ లు వేయడానికి వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయని మండిపడ్డారు. దమ్ము ధైర్యం ఉంటే పంచాయతీ ఎన్నికలను సజావుగా సాగనివ్వాలని పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. మహిళలను భయబ్రాంతులకు గురి చేయడానికి సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు పంచుమర్తి అనురాధ. అంతేకాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మార్చు కోవాలని, రావణ రెడ్డి గా పేరు పెట్టుకోవాలని, ఆయన ప్రవర్తన అలాగే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హద్దు మీరి మాట్లాడటం మానుకోకుంటే తగిన మూల్యం చెల్లించాలి
తెలుగుదేశం పార్టీ నాయకులంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పని చేతగాని ,సరిగ్గా మాట్లాడటం రాని , ఎలాంటి అభివృద్ధి చెయ్యని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి మంత్రులు రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు పంచుమర్తి అనురాధ. ఇష్టం వచ్చినట్టు , హద్దు మీరి మాట్లాడటం మానుకోకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని పంచుమర్తి అనురాధ హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన పాలనలో రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరని పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు.

దమ్ముంటే ఎన్నికల్లో తలపడు .. దొంగదారుల్లో బెదిరించటం కాదు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎవరితోనూ పద్ధతిగా మాట్లాడే అలవాటు లేదని పేర్కొన్న అనురాధ ఆయన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో మంత్రి కాంట్రాక్టుల దోపిడీ కొనసాగుతుందని ఆరోపించారు . పంచాయతీ ఎన్నికల్లో దమ్ముంటే తలపడాలని, అలా కాకుండా దొంగ దారులు వెతకటం ఓటమి భయంతోనే అని విమర్శించారు పంచుమర్తి అనురాధ.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications