వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘జగన్ సర్కారు మరుగుదొడ్లనూ వదల్లేదు.. కోర్టు చెంప ఛెల్లుమణిపించినా..’

|
Google Oneindia TeluguNews

అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ తుగ్లక్, సైతాన్ చర్యలతో ఏపీకి తీరని నష్టం జరుగుతోందని మండిపడ్డారు. రూ.3వేల కోట్ల ప్రజా ధనాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. రంగులు జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులతో తొలగించాలని డిమాండ్ చేశారు.

జగన్ పార్టీ నిస్సిగ్గుగా..

జగన్ పార్టీ నిస్సిగ్గుగా..

అనంతపురం జిల్లా అమలపురం మండలం తమ్మిడిపల్లి పంచాయితీలో అక్టోబర్ 31వ తేదీన జాతీయ జెండా రంగుకు వైసీపీ కార్యకర్తలు వైసీపీ రంగులు వేస్తే ఆనాడు తెలుగు మీడియాతోపాటు నేషనల్ మీడియా కూడా మండిపడింది. గ్రామాల స్థాయిలో చంద్రబాబునాయుడు కట్టిన భవనాలకు వైసీపీ ప్రభుత్వం పార్టీ రంగులను నిసిగ్గుగా వేసుకున్నారు' అని అనురాధ ధ్వజమెత్తారు.

మరుగుదొడ్లనూ వదల్లేదు..

మరుగుదొడ్లనూ వదల్లేదు..

‘పంచాయితీ భవనాలు, వాటర్ ట్యాంక్ లు, స్యూల్ భవనాలు, శ్మనానాలు, చివరికి మరుగుదోడ్లు కూడా వదలకుండా రూ.1500కోట్లు ఖర్చు పెట్టారు. ఏ నాడైనా చరిత్రలో ఇలా జరిగిందా? ఎన్నిసార్లు మేము మాట్లాడిన ప్రయోజనం లేకుండా పోయింది. 10రోజుల్లో వైసీపీ రంగులు తోలగించాలని ఏపీ చీఫ్ సెక్రటరీకి హైకోర్టు తీర్పు ఇవ్వడమే కాకుండా రంగులు తొలగించిన నివేదిక కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది' అని అనురాధ వ్యాఖ్యానించారు.

కోర్టు చెంప ఛెల్లుమణిపించినా..

కోర్టు చెంప ఛెల్లుమణిపించినా..

‘హైకోర్టు తీర్పు.. జగన్మోహన్ రెడ్డికి 151 మంది ఎమ్మెల్యేలకు, ఇష్టమెచ్చినట్లు మాట్లాడే బొత్స సత్యనారాయణకు ఇతర మంత్రులకు చెంపపెట్టు. హైకోర్టు వైసీపీ ప్రభుత్వాన్ని ఇప్పటికి 42 సార్లు ఎడపెడా చెంపలు వాయించిన కూడా వైసీపీ నాయకులలో చలనం లేదు. రంగులు వేయడానికి రూ.1500 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు తొలగించాడానికి మరో రూ.1500కోట్లు ఖర్చు చేస్తారు. ఈ రూ.3వేల కోట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఎవరిచ్చారు మీకు హక్కు' అని అనురాధ ప్రశ్నించారు.

Recommended Video

చంద్రబాబుకు జగన్ సూటి ప్రశ్న... రీపోలింగ్ అంటే అంత జంకెందుకు ? || Oneindia Telugu
జగన్‌ది నియంత పాలన.. నాశనం చేస్తున్నారు..

జగన్‌ది నియంత పాలన.. నాశనం చేస్తున్నారు..

‘మీరు పెట్టిన పథకాలకు న్యాయం చేయలేదు.. అమ్మఒడి పథకం ద్వారా అందరి న్యాయం చేయలేదు. అన్నక్వాంటీన్లు అపివేశారు, 45ఏళ్లకే మహిళలకు పింఛన్లు ఇవ్వలేదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పోరేషన్ నిధులు దారి మళ్లించారు. బీసీ కార్పోరేషన్ కు సంబంధించిన రూ.4000వేల కోట్లు దారి మళ్లించారు. ఈ రూ.3వేల కోట్లు మీ సొంత నిధులు కట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా రూ.3వేల కోట్లను ప్రజా ఖజానాకు చెల్లించాలి. రూ.3వేల కోట్లు ఉండే రైతులకు ధ్యానం కోనుగోలు చేసినందుకు ఉపయోగపడేవి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నియంత పాలన చేస్తున్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూంలు పెట్టిస్తే జగన్మోహన్ రెడ్డి వాటికి రంగులు వేయించారు. వైసీపీ రంగులపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలని మేం కోరుతున్నాం. ఏపీ చీఫ్ సెక్రటరీ వెంటనే రంగంలోకి దిగి రంగులను తొలగించేలా చర్యలు తీసుకోవాలి. జగన్ వ్యవహారశైలి వల్ల 16,700 మంది బీసీలకు రాజకీయంగా నష్టం జరిగింది. ఎక్కడా బీసీలు లేని చోట ఎంపీపీగా బీసీని కేటాయిస్తున్నారు. ఎక్కడా ఎస్సీలు లేని చోట జడ్పీటీసీలను కేటాయిస్తూ ప్రజాస్వామ్యాని నాశనం చేస్తున్నారు' అని జగన్ సర్కారుపై పంచుమర్తి అనురాధ విమర్శలు గుప్పించారు.

English summary
panchumarti anuradha hits out at cm jagan for color politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X