విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాళ్లిద్దరిది 13ఏళ్ల సహజీవనం: పురోహితుడి సలహాతో అనూహ్య నిర్ణయం

|
Google Oneindia TeluguNews

శృంగవరపుకోట: వాళ్లిద్దరిది 13ఏళ్ల సహజీవనం. శాస్త్రోక్తంగానో.. సాంప్రదాయబద్దంగానో వారు పెళ్లి చేసుకుని ఉండకపోవచ్చు. కానీ అందరు దంపతుల్లాగే.. ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగానే వారు సంతోషంగా జీవిస్తున్నారు. కారణం.. ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం. ఎంత అన్యోన్యంగా ఉంటున్నా సరే.. చివరకు సాంప్రదాయబద్దంగా వాళ్లు పెళ్లి చేసుకోక తప్పలేదు. అలా.. తమ ఇద్దరి పిల్లల సమక్షంలో ఇటీవలే ఆ జంట పెళ్లి చేసుకోవడం విశేషం.

 ఎవరీ జంట:

ఎవరీ జంట:

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం సంతగైరమ్మపేట ఎస్సీ కాలనీకి చెందిన నరవ సన్యాసిరావు, కొండమ్మ 13 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్నారు. ఒకే కులానికి చెందినవారైనప్పటికీ.. పెద్దలు అభ్యంతరం చెప్పడంతో.. ఊరి నుంచి పారిపోయారు.

సహజీవనంలో:

సహజీవనంలో:


ఊరి నుంచి వెళ్లిపోయిన ఏడాదికి తిరిగి ఆ జంట గ్రామంలోకి అడుగుపెట్టింది. తల్లిదండ్రులు, అత్తమామల ఇంటికి సమీపంలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. గ్రామం నుంచి వెళ్లిపోయిన తర్వాత వీరిద్దరు ప్రత్యేకించి వివాహం ఏమి చేసుకోలేదు. ఇద్దరూ భార్యాభర్తల లాగే సాఫీగా జీవితం గడుపుతున్నారు.

వ్రతం చేయాలని వెళ్తే..:

వ్రతం చేయాలని వెళ్తే..:

సన్యాసిరావు-కొండమ్మ దంపతులకు రమ్య(12), ఈశ్వరరావు(7) అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ బతికే ఈ దంపతులు.. ఆ డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసి ఇటీవలే ఓ చిన్నపాటి ఇంటిని నిర్మించుకున్నారు. గృహప్రవేశం సందర్భంగా సత్యనారాయణ వ్రతం చేయాలనే ఉద్దేశంతో పురోహితుడిని సంప్రదించగా అతనో ఊహించని మెలిక పెట్టాడు.

13ఏళ్ల తర్వాత పెళ్లి..:

13ఏళ్ల తర్వాత పెళ్లి..:

శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకోకుండా.. సహజీవనం చేస్తున్న దంపతులు సత్యనారాయణ వ్రతం చేయరాదని పురోహితుడు చెప్పాడు. దీంతో ఆలోచనలో పడ్డ ఆ జంట.. పురోహితుడి సూచన మేరకు దైవ సన్నిధిలో శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్నారు. గ్రామంలోని పెద్దలు తొలుత ఈ పెళ్లిపై ఆశ్చర్యం వ్యక్తం చేసినా.. ఆ తర్వాత అంతా తరలివచ్చారు.

పిల్లల సమక్షంలో ఒక్కటయ్యారు..:

పిల్లల సమక్షంలో ఒక్కటయ్యారు..:

స్థానిక రామాలయంలో బుధవారం ఉదయం 7.15 గంటలకు వేదమంత్రాల సాక్షిగా కొండమ్మ మెడలో సన్యాసిరావు మూడు ముళ్లు వేశారు. దీంతో శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్దంగా వీరి వివాహం జరిగినట్టయింది. బంధుమిత్రులు, గ్రామస్తులు ఈ జంటను ఆశీర్వదించగా.. వీరి పిల్లలు కూడా అమ్మనాన్నల పెళ్లి చూసి మురిసిపోయారు.

English summary
It's a strange incident took place in S kota town in Vizianagaram district. A couple married held in the presence of their children
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X