ఏమౌతుందో అర్థం కావట్లేదు: విభజనపై పరిపూర్ణానంద

ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి సమస్యను రాజకీయ పార్టీలే పరిష్కరించాలన్నారు. విభజన సమస్య ఓ చిక్కుముడిగా మారిందన్నారు. అది రాజకీయ సమస్య కాబట్టి వారే పరిష్కరించాలని ఆయన అన్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వారికి కూడా ఏమీ అర్థం కాని విధంగా మారిందని అభిప్రాయపడ్డారు.
ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితన్నారు. ఈ సమస్యకు వాళ్లు కారకులు.. వీళ్లు కారకులు అంటూ ఒకరిపై మరొకరు నిందలు వేసుకోకుండా సమాలోచనలు జరిపి మంచి ఆలోచనలతో మంచి పతక రచన చేయాలని అభిప్రాయపడ్డారు. సమన్వయం తీసుకు రావాలని కోరారు.
బిజెపి సమావేశాన్ని అడ్డుకున్న సమైక్యవాదులు
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో భారతీయ జనతా పార్టీ సమావేశాలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. మరోవైపు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో లక్షమందితో యాదవ గర్జన సభ నిర్వహించారు.












Click it and Unblock the Notifications