సునీత.. చలోబెజవాడ, కర్రతో బాలకృష్ణ, వందో సినిమాపై

 Paritala Sunitha to shift to Vijayawada
హైదరాబాద్: త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖను విజయవాడకు తరలిస్తామని మంత్రి పరిటాల సునీత సోమవారం తెలిపారు. విజయవాడలో కార్యాలయాలను చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు. హత్యా రాజకీయాలపై శాసనసభలో మాట్లాడాల్సి వస్తే... మొదటి అవకాశం తనకే ఇవ్వాలన్నారు.

హత్యారాజకీయాలతో అనేక ఇబ్బందులు పడ్డ కుటుంబం తనదన్నారు. ఈ రాజకీయాల వల్ల భర్తను సైతం తాను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో హత్యారాజకీయాలతో భయానక వాతావరణం సృష్టించిన వారు, ఇప్పుడు హత్యారాజకీయాలకు టీడీపీ పాల్పడుతోందని ఆరోపించడం హాస్యాస్పదమన్నారు.

కర్ర సాయంతో అసెంబ్లీకి బాలకృష్ణ

ఇటీవల షూటింగ్ సమయంలో గాయపడ్డ బాలకృష్ణ అసెంబ్లీకి చేతికర్ర సాయంతో వచ్చారు. కాలికి గాయం కావడంతో ఆయన చిత్కర్ర ఆసరాతో నడుస్తూ సభకు హాజరయ్యారు. ఆయనను పలువురు ప్రజాప్రతినిధులు పరామర్శించారు.

తనకు తగిలిన గాయానికి 7 కుట్లు పడ్డాయని, ప్రతి సినిమాకు గాయం గుర్తుగా మిగిలిపోతోందన్నారు. తన వందో సినిమా పైన అభిమానుల అంచనాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అభిమానులను తృప్తి పరచడంలోనే తనకు ఆనందం ఉందన్నారు. వారం రోజుల్లో పూర్తిగా కోలుకుంటానని, తర్వాత షూటింగ్‌లో పాల్గొంటానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+