వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు ఆగ్రహిస్తే: మోడీకి శివప్రసాద్ హెచ్చరిక, ఇలాగేనా.. కేవీపీ తీరుపై వెంకయ్య అసహనం

|
Google Oneindia TeluguNews

Recommended Video

TDP MP Sivaprasad Takes A Dig At Modi & Reveals Chandrababu's Strength

న్యూఢిల్లీ: ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ టీడీపీ, వైసీపీ ఎంపీలు లోకసభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ గళమెత్తారు. మరోవైపు పెట్రోల్ ధరల పెంపుపై టీఎంసీ నిరసన తెలిపింది. కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు నిరసనలకు దూరంగా ఉన్నారు.

ఎంపీ హుకుం సింగ్ మృతి నేపథ్యంలో ఆయనకు లోకసభ సంతాపం తెలిపింది. ఆ తర్వాత సభను మంగళవారానికి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలో నోయిడా ఫేక్ ఎన్‌కౌంటర్ పైన విపక్షాలు నిరసన తెలిపాయి. మరోవైపు ఏపీ ఎంపీలు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది.

గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీల నిరసన

గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీల నిరసన

రెండు సభలు వాయిదా పడిన అనంతరం టీడీపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. ఏపీకి బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని, విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని వారు వాపోయారు.

పార్లమెంటులో పోరు, టీడీపీ నోటీసు, ధర్నా: ఎన్నిసార్లు ఇలా.. రాజ్‌నాథ్‌కు బాబు షాక్, ఇదీ లెక్కపార్లమెంటులో పోరు, టీడీపీ నోటీసు, ధర్నా: ఎన్నిసార్లు ఇలా.. రాజ్‌నాథ్‌కు బాబు షాక్, ఇదీ లెక్క

బాబు సహనం.. వార్ డిక్లేర్

బాబు సహనం.. వార్ డిక్లేర్

ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ.. చంద్రబాబు సహనంతో ఉన్నారని, ఆయన సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందన్నారు. ఆయన ఆగ్రహిస్తే కనుక పరిస్థితులు విషమిస్తాయని హెచ్చరించారు. మోడీ ఎన్నో హామీలు ఇచ్చారని చెప్పారు. ఏపీ ప్రజలు సంతృప్తి చెందేలా సమాధానం ఇవ్వాలన్నారు. లేదంటే వార్ డిక్లేర్ చేసినట్లే అని అబిప్రాయపడ్డారు.

లోకసభలో టీడీపీ కంటే వైసీపీ ఓ అడుగు ముందు! నోటీసు, మోడీ అలా చేశారా అని బాబులోకసభలో టీడీపీ కంటే వైసీపీ ఓ అడుగు ముందు! నోటీసు, మోడీ అలా చేశారా అని బాబు

రాజ్యసభలో కేవీపీ రామచంద్ర రావు

రాజ్యసభలో కేవీపీ రామచంద్ర రావు

రాజ్యసభలో కేవీపీ రామచంద్ర రావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ నిరసన తెలిపారు. వివిధ అంశాలపై మరిన్ని విపక్షాలు నిరసన తెలిపాయి. ఢిల్లీ ఫేక్ ఎన్‌కౌంటర్ పైన నిరసన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది.

ఇలాగేనా ప్రవర్తించేది

ఇలాగేనా ప్రవర్తించేది

రాజ్యసభలో కేవీపీ ఓ సమయంలో ప్లకార్డు పట్టుకొని పోడియంలోకి వెళ్లి తన నిరసన తెలిపారు. ఆయనకు మద్దతుగా కొందరు కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. రాజ్యసభ అధ్యక్ష స్థానంలో ఉన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎంతగా సర్ది చెప్పినా వినలేదు. ఈ సమయంలో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ప్రశ్నోత్తరాల సమయం వద్దా అని నిలదీశారు. సభలో ఇలాగేనా ప్రవర్తించేది, దయచేసి వెనక్కి వెళ్లండని చెప్పారు.

పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నారు

పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నారు


ఇక్కడ కూర్చొని ఏం చేయాలో తనను ఎవరూ అదేశించలేరని, సభను నడిపించాలన్న ఉద్దేశ్యం మీకు లేదా, పరువు తీస్తున్నారని వెంకయ్య వాపోయారు. యూ కెనాట్ డిక్టెట్ మీ, మీరు చెప్పేదేదీ రికార్డుల్లోకి ఎక్కదు, ఇలాగే చేస్తే మధ్యాహ్నం వరకు సభను వాయిదా వేస్తానని చెప్పారు. మిస్టర్ రాచమంద్ర రావు ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్, ప్రజా సంక్షేమంపై మీకు శ్రద్ధ లేదా, కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నారు, దీనిని నేను అంగీకరించనని చెప్పారు. అనంతరం సభను వాయిదా వేశారు.

English summary
The Lok Sabha was adjourned for the day after the House paid a tribute to late BJP MP Hukum Singh. Bharatiya Janata Party leader and member of Parliament (MP) from Kairana, Hukum Singh, passed away at the JP Hospital in Noida on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X