చంద్రబాబుకు సింగపూర్‌లో హోటల్, ఆస్తులు: పార్థసారథి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సింగపూర్‌లో హోటల్ ఉందనే విషయం దెశమంతా తెలుసునని, ఈ విషయంపై ప్రముఖ పత్రిక సండే గార్డియన్ వార్తాకథనం ప్రచురించిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు పార్థసారథి ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తోందని అన్నారు.
చంద్రబాబుకు సింగఫూర్‌పై అంత ప్రేమ ఎందుకని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ముంటే సింగపూర్‌లోని తన ఆస్తులు, లావాదేవీలపై సిబిఐతో గానీ ఎస్ఎఫ్ఐతో గానీ విచారణకు సిద్ధపడాలని ఆయన అన్నారు.

నల్ల ధనానికి సింగపూర్ హబ్‌గా మారిందని సండే గార్డియన్ రాసిందని ఆయన చెప్పారు. చంద్రబాబు నిజాయితీని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని పార్థసారథి అన్నారు.
ఇదిలావుంటే, ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి జరుగుతుందని శ్రీకాకుళం జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్ట అధ్యక్షురాలు రెడ్డి శాంతి అన్నారు. కొత్తూరు మండలం వైఆర్ పేటలో ఆమె శనివారంనాడు మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధన కోసం తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి 7వ తేదీ నుంచి నిరవధిక దీక్ష చేస్తున్నారని, దానికి ప్రజలంతా సహకరించాలని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications