ఇప్పుడే నిద్రలేచినట్లున్నారు, బాబు డైరెక్షన్‌లో రాహుల్ యాత్ర: పార్థసారథి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ ఇప్పుడే నిద్ర లేచి వచ్చినట్లున్నారని, ఆయనకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాన్ని విమర్శించే అర్హత లేదని పార్థసారథి అన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
స్వార్థంతో రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన రాహుల్ గాంధీ మాటలు విడ్డూరంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలు పట్టించుకోవడానికి రాహుల్ గాంధీకి 14 నెలల సమయం పట్టిందా? అని ప్రశ్నించారు.

ఓటుకు నోటు, ఎర్రచందనం కూలీల బూటకపు ఎన్‌కౌంటర్, పుష్కరాల తొక్కిసలాట.. ఇలాంటి ముఖ్యమైన అంశాలను పార్లమెంటులో ప్రస్తావించడానికి మీకు సమయం లేదా అంటూ రాహుల్ గాంధీని నిలదీశారు. రాహుల్ గాంధీతో పాఠాలు చెప్పించుకోవాల్సిన అవసరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదని పార్థసారథి స్పష్టం చేశారు.
చంద్రబాబు కోసమే, చంద్రబాబు వల్లే, చంద్రబాబు డైరెక్షన్‌లోనే రాహుల్ పాదయాత్ర సాగుతోందని ఆరోపించారు. పట్టిసీమపై రాహుల్ ఎందుకు మాట్లాడటంలేదని పార్థసారథి ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications