పోలవరం ప్రాజెక్ట్ పై అన్ని పార్టీలు ఏకం కావాలి: లోక్ సత్తా జేపీ
గుంటూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం అన్ని రాజకీయ పార్టీలు భేషజాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏకతాటిపై నడవాల్సిన అవసరం ఉందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ పిలుపు నిచ్చారు. లోక్‌సత్తా పార్టీ తలపెట్టిన సురాజ్య యాత్ర శుక్రవారం గుంటూరు నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా లోక్ సత్తా అధినేత జెపి పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు.

పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అని, అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో నదీ జలాలను సక్రమంగా వినియోగించుకునేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని జేసి అన్నారు. మరోవైపు పరిపాలనా బాధ్యతలు నెరవేర్చడంతో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ప్రజల బతుకులు మార్చాలని విజ్ఞప్తి చేస్తూ లోక్ సత్తా పార్టీ సురాజ్య యాత్ర చేపట్టినట్లు వెల్లడించారు. తాను ఈనెల 13న ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చించనున్నట్లు జేపీ తెలిపారు.












Click it and Unblock the Notifications