
సత్తెనపల్లి టీడీపీలో పదవుల చిచ్చు-కోడెల వర్గం అసంతృప్తి-రాజీనామాల హెచ్చరిక !
సత్తెనపల్లి : పల్నాడు జిల్లా సత్తెనపల్లి టీడీపీలో ముసలం చోటు చేసుకుంది. తాజాగా పార్టీ ప్రకటించిన వ్యవస్ధాగత పదవుల్లో తమ వర్గాన్ని కాదని జీవీ ఆంజనేయులు వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడంపై స్ధానిక నేత కోడెల శివరాం భగ్గుమంటున్నారు. తన వర్గం నేతలతో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టించి అధిష్టానానికి హెచ్చరికలు పంపారు.
మండల అధ్యక్షుల నియామకాల్లో తమ వర్గానికి న్యాయం చేయకపోతే మూకుమ్మడి రాజీనామా లు చేసే ఆలోచనలో ఉన్నట్లు కోడెల శివరాం వర్గం ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి హెచ్చిరించింది. మండల అధ్యక్షుల నియామకంపై కోడెల మార్క్ పనిచేయకపోవడంతో ఆ వర్గం ఆగ్రహంగా ఉంది. పార్టీకి పనిచేసే వారికి ప్రాధాన్యత లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. దీంతో సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్ లో అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. దీనికి ఐదు మండలాల ముఖ్య నేతలు హాజరయ్యారు. భేటీ అనంతరం అధినేత చంద్రబాబును కలిసి వాస్తవాలు వివరించాలని నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం ప్రకటించిన పార్టీ పదవులు రద్దు చేయకపోయతే రాజీనామాలు చేయాలని నేతలు నిర్ణయించారు. కమిటీలు ఏక పక్షంగా నిమించటంతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నట్లు వారు తెలిపారు. రేపు వీరు చంద్రబాబును కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం పార్టీలో కేవలం సత్తెనపల్లి నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు నియామకాలను ఏకపక్షంగా ఎన్నుకోవడం సరికాదని వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు అధిష్టానానికి తమ ఆవేదన వ్యక్తం చేశారు.
సత్తెనపల్లి టీడీపీలో పదవుల చిచ్చు-కోడెల వర్గం అసంతృప్తి-రాజీనామాల హెచ్చరిక..!!#TDP #Chandrababu #Andhrapradesh #ApPolitics #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/DFG8nKcV6S
— oneindiatelugu (@oneindiatelugu) November 30, 2022
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం సత్తెనపల్లి నియోజకవర్గంలోని గ్రామ పార్టీ అధ్యక్ష కార్యదర్శుల, మండల పార్టీ మాజీ నాయకులు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు సేకరించకుండా నూతన మండల పార్టీ అధ్యక్షులు అంటూ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయించడం తగదని తద్వారా గ్రామస్థాయిలో పార్టీకి ఎంతో నష్టం జరిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.