‘చార్మినార్’లో దోపిడీ దొంగల బీభత్సం: టైం చూసి బంగారం, నగదు దోచుకెళ్లారు
హైదరాబాద్: చెన్నై నుంచి హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. వివరాలిలా ఉన్నాయి. చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రకాశం జిల్లా రాపర్ల వద్దకు రాగానే గుర్తు తెలియని వ్యక్తులు చైన్ లాగి రైలును ఆపేశారు.
ఐదు బోగీల్లోకి చొరబడిన దుండగులు బోగీల్లోని మహిళల బంగారంతో పాటు వారి వద్ద ఉన్న నగదును కూడా దోచుకున్నారు. ప్రయాణికులను మారణాయుధాలతో బెదిరించి, వారి వద్ద ఉన్న బంగారం, నగదు దోచుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సమయంలో రైలులో పోలీసులు లేరని తెలుస్తోంది. ఆ తర్వాత విజయవాడ చేరుకున్న తర్వాత బాధితులు రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరి కొంత మంది బాధిత ప్రయాణీకులు సికింద్రాబాదా చేరుకున్న తర్వాత దోపిడీ ఘటనపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications