ఏపీ సీఎం చంద్రబాబుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఫోన్ కాల్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: విశాఖపట్నంలో ఒడిశాకు చెందిన విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఈ విషయమై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మంగళవారం ఫోన్ చేశారు. విద్యార్థి మృతిపై దర్యాఫ్తు జరిపించాలని కోరారు.

సంబాల్‌పుర్‌ జిల్లాకు చెందిన శ్రేయాస్‌ అనే విద్యార్థి తల్లిదండ్రులు సచివాలయానికి వచ్చి సీఎంను కలిసినట్లు ఒడిశా అధికారులు తెలిపారు.

Patnaik calls up Andhra CM, seeks special agency probe in

తమ కొడుకును డిసెంబరు 26న విశాఖలోని ఓ ప్రయివేటు కళాశాల హాస్టల్‌లో సాటి విద్యార్థులు విచక్షణారహితంగా కొట్టారని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు.

ప్రియ వారియర్ కనుసైగలకు ఫిదా, ఎవరీమె? యువత గుండె పిండేస్తున్న వీడియో

మరుగుదొడ్డిలో పడిన మీ అబ్బాయికి గాయాలయ్యాయని ఫోన్‌ చేయడంతో ఒడిశాలోని తమ ఇంటికి తీసుకు వచ్చామని విద్యార్థి తండ్రి చెప్పారని తెలిపారు. కొన్నిరోజుల అనంతరం ఛాతి, కాళ్లు, చేతులు నొప్పిగా ఉన్నాయనడంతో ఆసుపత్రిలో చేర్పించామని, చికిత్స పొందుతూ జనవరి 7న భువనేశ్వర్‌ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Odisha Chief Minister Naveen Patnaik today urged his AP counterpart N Chandrababu Naidu for conducting a probe into the death of a student from Odisha at a Vishakhapatnamcollege by a special agency.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి