పట్టాభి అరెస్ట్ - ఇద్దరు పోలీసు అధికారులపై వేటు : నోటీసులు జారీలో అలసత్వం..!!

ముఖ్యమంత్రి జగన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి అరెస్ట్..కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఇద్దరు పోలీసు అధికారులు బదిలీ అయ్యారు. పట్టాభి అరెస్టు సమయంలో నిబంధనలు పాటించలేదని ఇద్దరు పోలీసు అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పోలీసుల తీరును న్యాయమూర్తులు తప్పుపట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెదేపా నేత పట్టాభి అరెస్టు సమయంలో నిబంధనలు సరిగా పాటించలేదని పోలీసుల తీరును న్యాయమూర్తులు తప్పుపట్టిన నేపథ్యంలో ఇద్దరు అధికారులపై బదిలీ వేటు పడిందని తెలుస్తోంది.

నోటీసులు ఇచ్చే సమయంలో అసంపూర్తిగా

నోటీసులు ఇచ్చే సమయంలో అసంపూర్తిగా

ఈ వ్యవహారంలో విజయవాడ నగర కమిషనరేట్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఏసీపీ రమేష్‌, సీఐ నాగరాజు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. అరెస్టు సమయంలో ఖాళీలతో 41 (ఏ) సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చినందునే వీరి బదిలీ జరిగినట్లు సమాచారం. సీఎం జగన్‌ను దూషించిన కేసులో గవర్నర్‌పేట పోలీసులు ఈ నెల 20న పట్టాభిని అరెస్టు చేసారు. 21న మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఖాళీలతో ఉన్న నోటీసు ఇవ్వడంపై మేజిస్ట్రేట్‌ అభ్యంతరం చెప్పారు. దీనిపై విచారణ అధికారిగా ఉన్న గవర్నర్‌పేట సీఐని వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

పోలీసుల తీరు పైన కోర్టు ఆగ్రహం

పోలీసుల తీరు పైన కోర్టు ఆగ్రహం

హైకోర్టులో వాదనల్లోనూ ఇదే విషయంపై పోలీసులను న్యాయమూర్తి తప్పుపట్టారు. ఈ నేపథ్యంలోనే బదిలీ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం సీటీసీ ఏసీపీగా ఉన్న రమేష్‌ను డీజీపీ కార్యాలయంలో, సీఐ నాగరాజును ఏలూరు రేంజ్‌ డీఐజీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్‌బీలో పనిచేస్తున్న సురేష్‌ను గవర్నర్‌పేట ఇన్‌ఛార్జి సీఐగా సీపీ శ్రీనివాసులు నియమించారు. పట్టాభికి బెయిల్‌ మంజూరులో అసంపూర్తి నోటీసులు, అయన నుంచి వివరణ తీసుకోకుండానే అరెస్టు అంశాలు కీలకమయ్యాయి.

ఇద్దరు అధికారుల పై వేటు వేస్తూ

ఇద్దరు అధికారుల పై వేటు వేస్తూ

పోలీసు ఉన్నతాధికారులు దీన్ని పరిగణనలోకి తీసుకుని బాధ్యతగా వ్యవహరించలేదన్న కారణంతో బదిలీ చేసినట్లు సమాచారం. హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన తరువాత పట్టాభి నేరుగా హైదరాబాద్ వెళ్లారు. అక్కడి నుంచి మాల్దీవులకు వెళ్లారు. ఆయన విమానంలో మాల్దీవులకు వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పట్టాభి ఒక వీడియో విడుదల చేసారు. తన ఇంటి పైన దాడితో తన కుమార్తె భయాందోళనకు గురయ్యారని..ఆ పరిస్థితుల నుంచి బయట పడేందుకే తాము రావాల్సి వచ్చిందని వివరించారు. అయితే, పట్టాభి వ్యాఖ్యలు..ఆ తరువాతి పరిణామాల పైన ఇంకా రాజకీయంగా ఢిల్లీ - అమరావతిల్లో చర్చ కొనసాగుతూనే ఉంది. రెండు పార్టీల కేంద్రానికి.. ఎన్నికల సంఘానికి వరుసగా ఫిర్యాదులు చేస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+